సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో కన్నుమూసారన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఆయన మరణ వార్త వినగానే సినీ ఇండస్ట్రీ తో పాటు అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఒక కుటుంబంలో ఒకరు చనిపోతేనే ఆ బాధ వర్ణదాతీతం. కానీ ఘట్టమనేని కుటుంబంలో ఒకే సంవత్సరంలో వరుసగా మూడు మరణాలు సంభవించాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఏడాది ప్రారంభంలోనే మహేష్ బాబు అన్న రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో మరణించారు. ఇక రమేష్ బాబు మరణించినప్పుడు మహేష్ బాబు కరోనా వల్ల క్వారంటైన్ లోనే ఉండిపోయారు. కనీసం అన్నయ్య అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని పరిస్థితిలో మహేష్ బాబు ఉన్నాడు. అన్న అంటే మహేష్ బాబుకు ఎనలేని ప్రేమ.. అలాంటి అన్న చివరి చూపుకు కూడా మహేష్ బాబు నోచుకోలేకపోయారు. ఇక ఈ మధ్యనే సెప్టెంబర్ 28 న ఇందిరా దేవి తల్లి వయో సంబంధిత వ్యాధులతో మరణించారు.

అన్న మరణ వార్త మరవకముందే తల్లి మరణించడంతో మహేష్ బాబు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఇక ఈ విషయంలో కృష్ణ కూడా అటు భార్యను,ఇటు కొడుకుని పోగొట్టుకొని ఎంతో కుమిలిపోయారు. ఇక ఇందిరా దేవి చనిపోయి కనీసం రెండు నెలలు కూడా గడవకముందే సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఇంట్లో ఉండగానే హార్ట్ ఎటాక్ రావడంతో కృష్ణ ని హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు.

వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నాము ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది 48 గంటలు గడిస్తే గానీ ఏమి చెప్పలేని పరిస్థితి అంటూ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సంవత్సరంలో వరుసగా మహేష్ బాబు ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ఇలా ఘట్టమనేని ఇంట్లో వరుస మరణాలు సంభవించడంతో మహేష్ బాబు ఫ్యామిలీని ఏదైనా శాపం వెంటాడుతుందా అనే ఆలోచన లో పడ్డారు మహేష్ బాబు అభిమానులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *