ఈరోజు ఉదయం తెల్లవారుజామున మల్టీ ఆర్గాన్స్ పనిచేయకపోవడం వల్లే చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఈయన మరణం సినీ ఇండస్ట్రీకే కాదు రాజకీయ రంగంలో కూడా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక గొప్ప లెజెండ్రి యాక్టర్ అంతకంటే గొప్ప రాజకీయవేత్త అయిన సూపర్ స్టార్ కృష్ణ మరణించడం నేడు ప్రతి ఒక్కరిని మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

అటు సినీ ప్రేమికులు ఇటు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు అభిమానులు కూడా కృష్ణ మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.ఇకపోతే తండ్రి మరణంతో మహేష్ బాబు పూర్తిగా నిస్సహాయుడయ్యాడనే చెప్పాలి.. ఉన్న ఒక పెద్ద దిక్కు కూడా కోల్పోవడంతో ఏం చేయాలో దిక్కు దోచని పరిస్థితుల్లో ఒంటరివాడు అయ్యాడనే భావనను కూడా మహేష్ బాబులో కలుగుతూ ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కన్నీళ్లతో తాను నటిస్తున్న సినిమా నిర్మాతలు అందరికీ ఫోన్లు చేసి ” ప్రస్తుతం నేను ఎక్కడికి రాను.. దయచేసి షూటింగ్ లన్ని ఆపేయండి”.. అంటూ ఫోన్ చేసి మరి చెబుతున్నారట.

ఇక మహేష్ బాబు ఉన్నట్టుండి కన్నీళ్ళతో తన బాధను వ్యక్తం చేసేసరికి అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.తండ్రి మరణం మహేష్ బాబును అంత త్వరగా బయటికి తీసుకొస్తుంది అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. తల్లి మరణించి కనీసం రెండు నెలలు కూడా పూర్తి కాకముందే తండ్రి మరణంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్రస్థాయిలో మనస్థాపం చెందుతున్నారు.

ఇదిలా ఉండగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో తన తండ్రి మరణంతో సినిమా షూటింగ్ ఆపేయాలని ఈ సినిమా నిర్మాతలకు ఫోన్ చేసి మరి చెప్పారట. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో కూడా తాను ఇప్పుడే నటించబోయేది లేదన్నట్టుగా కూడా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *