సూపర్ స్టార్ కృష్ణ.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తేన మనసులు సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించారు. కౌబాయ్, జేమ్స్ బాండ్,గూడచారి వంటి సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించారు. ఇక ఈయన సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించారు. అలాగే ఆయన సినీ కెరియర్ మొదలైనప్పటి నుండి ఎంతో సపోర్ట్ గా నిలిచిన విజయనిర్మలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే విజయనిర్మల తర్వాత కృష్ణకి మరో హీరోయిన్ అంటే చాలా ఇష్టమట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కృష్ణ గారి కెరియర్ మలుపు తిప్పిన సినిమాల్లో సాక్షి సినిమా ఒకటి. ఈ సినిమాలో ఈయన అమాయకుడైన పాత్రలో నటించాడు. ఇక విజయనిర్మల కృష్ణను ప్రేమించే గడసరి అమ్మాయిలాగా నటించింది. ఇక ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సాక్షి సినిమాలో నటించిన విజయనిర్మల కృష్ణ ఇద్దరు తొలి పరిచయంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక కృష్ణ స్టార్ హీరో అయిపోయాక కొంతమంది హీరోయిన్లతో వరుసగా సినిమాలు చేసేవారు. అందులో జయప్రద,జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్స్ తో కృష్ణ పదుల సంఖ్యల్లో సినిమాలు చేసేవారు.

ఎందుకంటే అప్పట్లో ముంబై నుండి హీరోయిన్లను తీసుకువచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న హీరోయిన్లతోనే వరుసగా సినిమాలు చేసేవారు. ఇక అప్పట్లో వాణిశ్రీ,సావిత్రి వంటి స్టార్ హీరోయిన్స్ శకం ముగిసాక జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమై తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు. ఇక కృష్ణ సరసన జయప్రద ఏకంగా 40 కి పైగా సినిమాల్లో నటించింది. కానీ కృష్ణకి ఇష్టమైన హీరోయిన్ మాత్రం శ్రీదేవేనట. శ్రీదేవి కృష్ణ కాంబినేషన్లో 30కి పైగా సినిమాలు వచ్చాయి. అయితే కృష్ణ వేరే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీదేవి ఆ సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం టక్కున డేట్స్ ఇచ్చేసేవాడట.

అంతేకాదు కృష్ణ గారు తన క్యాలెండర్లో శ్రీదేవి కోసం కొన్ని ప్రత్యేకంగా డేట్స్ లాక్ చేసి పెట్టుకునే వారట.ఇక ఈ విషయం చూస్తే శ్రీదేవి అంటే కృష్ణకు ఎంత ఇష్టమో అర్థం అవుతుంది. శ్రీదేవి కృష్ణ కలసి చుట్టాలొస్తున్నారు జాగ్రత్త కృష్ణార్జునులు,బుర్రిపాలెం బుల్లోడు, పచ్చని కాపురం, బంగారు కొడుకు వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించారు.అంతేకాదు సిల్వర్ స్క్రీన్ పై హిట్ పెయిర్ గా కూడా శ్రీదేవి కృష్ణ పేరు సంపాదించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *