మామూలుగా అవమానాలు అంటే అందరికీ వస్తూ ఉంటాయి. అలాగే సాధారణ సామాన్యుల నుండి పెద్ద పెద్ద రంగాలకు చెందిన వాళ్ల వరకు ఈ అవమానాలు సహజం. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, నటీనటులకు ఇలాంటి అవమానాలు చాలా ఎదురవుతుంటాయి. ఒక హోదాలో ఉన్నవారికి ఇలాంటి అవమానాలు జరిగినప్పుడు వాళ్ల కెరీర్ ని దెబ్బతీస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఒక నటి తనని అవమానించారని కొన్ని విషయాలను బయట పెట్టింది. ఇంతకు ఆ నటి ఎవరంటే జ్యోతి లబలా. ఈమె టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బుల్లితెర మీద కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాకుండా ఈమె రియాల్టీ షో బిగ్ బాస్ లో సీజన్ 1 లో పాల్గొనింది. ఈమె తొలిసారిగా అందం సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఆ తరువాత పెళ్ళాం ఊరెళితే, హంగామా, ఎవడి గోల వాడిది వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇక ఆమె కొన్ని తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేసింది. అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో కూడా ఈమె పేరు మారు మ్రోగింది. ఇక ఈమె ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ కొన్ని విభేదాల వల్ల తన భర్తతో విడాకులు తీసుకొని తన కొడుకుతో వంటరి జీవితాన్ని గడుపుతుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తన గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. అంతేకాకుండా గతంలో తనకు అమెరికాలో అవమానం జరిగిందని చెప్పింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటే.. ఒకసారి తాను ఒక షో పరంగా అమెరికాకు వెళ్ళినప్పుడు.. అక్కడ తమకు హెడ్గా ఏవీఎస్ ఉన్నారట. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత జ్యోతికి యాక్టింగ్ రాదు అంటూ తనను మా టీంలోకి తీసుకోను అని అన్నాడట ఏవీఎస్

దాంతో ఆమె నాకు సెట్ కానీ వాళ్ల దగ్గర ఎందుకు ఉండాలి అని అనుకుందట. అయితే అక్కడే మురళీమోహన్లు, గోపాలకృష్ణ టీం కూడా ఉందట. అయితే అక్కడ గోపాలకృష్ణ గారికి జరిగిందంతా చెప్పటంతో నువ్వు మా టీంలో ఉండు అన్నారట. కానీ అక్కడ ఏవీఎస్ అలా అందరి ముందు అనటంతో అవమానంగా ఫీల్ అయ్యానని జ్యోతి తన మాటల్లో చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *