మహేష్ బాబు ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రితో , అన్నయ్యతో కలిసి పలు సినిమాలలో నటించిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక తన అన్నయ్య సహకారంతో స్టార్ హీరోగా ఎదిగిన మహేష్ బాబు తండ్రి సహకారంతో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఉన్నత స్థానానికి చేరుకున్న మహేష్ బాబును ఆ కుటుంబ సభ్యులే వదిలి వెళ్లడం తీవ్రమైన బాధాకరమని చెప్పాలి.

Mahesh Babu's sibling Ramesh Babu dies of liver-related complicationసాధారణంగా ఏ ఒక్క హీరో కుటుంబంలో అయినా ఒక్కసారి మాత్రమే ఇలాంటి ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటాయి. కానీ మహేష్ బాబు జీవితంలో అందులోనూ ఓకే ఏడాది ముగ్గురు మరణించడం ఆయనను మరింత కలచి వేస్తోంది. మహేష్ బాబు దుఃఖాన్ని ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూసి ప్రతి ఒక్కరూ మరింత దుఃఖితులవుతున్నారు. నిజానికి ఈ ఏడాది జనవరిలో కరోనా తగ్గుముఖం పట్టిందని అందరూ అనుకున్నారు. కానీ మహేష్ బాబు అన్న రమేష్ బాబు మరణించి మరింత మానసిక వేదనకు గురిచేసింది.

Actor Ghattamaneni Ramesh Babu passes away- Cinema express

అయితే రమేష్ బాబు చివరి చూపుకి కూడా మహేష్ బాబు నోచుకోలేకపోయారు. కారణం ఆయనకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో అన్నయ్య దహన సంస్కారాలను కల్లారా చూసుకోలేకపోయారనే బాధ మహేష్ బాబును వేధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బాధను మర్చిపోకముందే తనను ఎంతో ప్రేమగా చూసుకునే తన తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ నెలలో మరణించడం మరింత మనస్థాపానికి గురిచేసిందని చెప్పవచ్చు.

Superstar Krishna and Indira Devi arrive at Padmalaya Studios for son  Ramesh Babu's final rites. See pics - India Todayఅటు అన్న మరణం ఇటు తల్లి మరణం మరిచిపోక ముందే తండ్రి మరణం కూడా జరిగి మరింత విలవల్లాడిపోతున్నారు మహేష్ బాబు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సూపర్ స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్స్ పనిచేయకపోవడం వల్లే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు , సినీ ప్రేమికులు, అభిమానులు అందరూ కూడా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు అంతేకాదు మహేష్ బాబు కష్టాన్ని చూసి సామాన్య ప్రజలు సైతం కన్నీటితో తమ కళ్ళను చమర్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *