అనుష్క.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇక అరుంధతి సినిమాతో అనుష్క పేరు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఒక్క సినిమాతో అనుష్క పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే అనుష్క ఒక సినిమాలో హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఆ బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో మనకు తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాను అప్పట్లో పాన్ ఇండియా లెవెల్ లో గనుక విడుదల చేస్తే తెలుగు ఇండస్ట్రీలో మొదటి పాన్ ఇండియా సినిమాగా మగధీర సినిమా పేరు తెచ్చుకునేది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత తర్వాత రెండో సినిమాగా మగధీర తెరకెక్కింది. ఇక రెండో సినిమాతోనే రామ్ చరణ్ తన సత్తా ఏంటో తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ని హర్ష పేరు కన్నా కాలభైరవ అనే పేరుతోనే ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు. మగధీర సినిమా 2009 జూలై 31న చాలా గ్రాండ్ గా థియేటర్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమా విడుదలై ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కెరియర్లని ఓ మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు డబుల్ లాభాలు వచ్చాయి. ఇక మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, కాజల్ అగర్వాల్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో కాజల్ కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకుంది.

అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ కాకుండా అనుష్క శెట్టి ని అనుకున్నారట. కానీ రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉన్నాడనే ఓ సిల్లి రీజన్ తో అనుష్క ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిందట. అనుష్క రామ్ చరణ్ కంటే కాస్త హైట్ లో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తే అక్క తమ్ముడు లాగా ఉంటారని అనుష్క ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. అయితే అనుష్క రాజమౌళి డైరెక్షన్లో అప్పటికే రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమాలో నటించింది. ఒకవేళ మళ్లీ ఈ సినిమాలో గనుక అనుష్క నటిస్తే ఆమె కెరియర్ మరో రేంజ్ లో ఉండేది అని అప్పట్లో సినీ విశ్లేషకులు భావించారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *