టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకుడిగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ అయన సినిమాలు మెల్లగా చేయడం ఆశ్చర్యంగా ఉంది. రన్ రాజా రన్ సినిమా హిట్ కొట్టినా ‘సాహో’ సినిమా తెలుగులో నిరాశ పరిచింది. అయితే అది హిందీలో మాత్రం వంద కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. దీంతో ఇండియా వైడ్ పాపురల్ అయిన డైరక్టర్ సుజిత్..

మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయారు. కనీసం బాలీవుడ్ లో అయినా అయన ప్రయత్నాలు చేసుంటే అవకాశాలు వచ్చేవేమో. కానీ తెలుగులో సినిమా చేయాలనీ చూడడం అవి మధ్యలోనే ఆగిపోవడం జరిగాయి.

కనీసం అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఏళ్ళు గడుస్తున్నాయి కానీ.. అసలు టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. పవన్ తో సినిమా చేస్తాడు అన్న వార్తలు రాగా పవన్ ఒప్పుకున్నా సినిమాలకే దిక్కు లేదు. ఈ సినిమా ఎంతవరకు చేస్తాడు అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *