ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎటువంటి సర్వే ని ఎవరు చేసిన కామన్ గా ఒక విషయంలో మాత్రం అందరికీ సెమ్ సమాధానం వస్తోంది. ఇపుడు అదే ఏపీలో గట్టి జనాభిప్రాయంగా కనబడుతుంది. అదేంటంటే రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పధకాల ఎఫెక్ట్ బాగా ఉంది. రీసెంట్ గా ఒక విపక్ష పార్టీ కోసం చేసిన సర్వేలో కూడా సంక్షేమ పధకాల మీద వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి ప్రజల్లోనే డామేజ్ అవుతుంది అని అన్నారు.

ఇటీవల జరిగిన ఇక సిట్యువేషన్ దానికి ఉదాహరణ గా చెప్పవచ్చు.విజయనగరం జిల్లాలో తిరిగిన పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. తాము అధికారంలోకి వస్తే ప్రెసెంట్ ఉన్న సంక్షేమ పధకాలను అన్నీ కంటిన్యూ చేస్తామని దీనికి మరికొన్ని యాడ్ చేస్తామని అన్నారు. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే జనసేనకు ఏపీలో సంక్షేమ పధకాల మీద జనాల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ అర్ధమైంది అని అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పధకాల మీద చేసిన కామెంట్స్ కి వైసీపీ మహిళా నాయకురాలుఐనా జీసీసీ చైర్ పర్సన్ స్వాతీరాణి రెస్పాండ్ అయి రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్న అనేక పధకాలు ప్రజలకు బాగా చేరువ అయ్యాయని ఆమె అంటూ ఇపుడు దాన్ని విపక్షాలు కూడా ఒప్పుకుంటున్నారని తెలిపారు.

అలాగే ఏపీలో సంక్షేమ పధకాల మరియు పరిపాలన గురించి జనాలే విపక్షాలకు చెప్పి వాళ్లు చేసే విమర్శలకు అడ్డుకట్ట వేస్తారని ఆమె అంటున్నారు. అదేవిధంగా ఏపీలో జగనన్న కాలనీలలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదని, దేశం గొప్పగా చెప్పుకునే అతి పెద్ద గృహ యజ్ఞం జరుగుతోందని, ఎప్పుడు లేదు ఇంకెప్పుడు రాదు అని అన్నారు.దీని మీద కూడా విపక్షాలు త్వరలోనే అంగీకరించే రోజు వస్తుందన్నారు.దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే మరల రాబోయే ఎన్నికల్లో జగన్ గారు గెలవడం ఖాయం అని సర్వే లో తెలిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *