గతంలో విడుదల ఐ మంచి హిట్ అందుకున్న మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అందులో మహేష్ బాబు కు జంటగా సమంత చేసింది.అలాగే ఆ మూవీ లో సమంత అక్క క్యారెక్టర్ లో నటించి సందడి చేసింది నటి కల్పికా గణేష్. ఈ మూవీ ద్వారా కల్పిక కు మంచి గుర్తింపు వచ్చింది.ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో కూడా ఆమె నటించి సందడి చేశారు.ఈ మూవీ నవంబర్ 11వ తేదిన థియేటర్స్ లో కి వచ్చి ఎంతో మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది.ఐతే ఈ మూవీ మంచి విజయం అవ్వడంతో ఈమూవీలో చేసిన కొంతమంది నటీమణులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నటి కల్పికా గణేషన్ ఈ మూవీ లో తన క్యారెక్టర్ గూర్చి దాని ప్రాధాన్యత గురించి చెప్పారు.యశోద మూవీ లో కల్పికా గణేషన్ గర్భవతి పాత్రలో నటించారు.ఐతే ఈ విధంగా ప్రెగ్నెంట్ గా ఈమె నటించడానికి గల కారణాలను ఈ సందర్భంగా మీడియా తో తెలియజేశారు.తాను ఎన్నో మూవీస్లలో మెయిన్ క్యారెక్టర్స్ చేసినప్పటికి యశోద వంటి మూవీస్ చాలా రేర్ గా వస్తాయని తెలిపారు. యశోద లాంటి అద్భుతమైన కథ అందరికీ తెలియాలని నేను ఈ మూవీ లో గర్భవతి పాత్రలో నటించానని కల్పిక తెలిపారు.

ఐతే ఈ చిత్రానికి డైరెక్టర్ హరి హరీష్ తెరకేక్కించారు. ఆదిత్య 369 వంటి అద్భుతమైన మూవీస్ ని అందించిన ప్రొడ్యూసర్ శివ లెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని ఎంతో గొప్పగా నిర్మించారు. ప్రెసెంట్ ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా కమర్షియల్ గా ఎలాంటి హిట్ అందుకుంటుందో ఇంకా తెలియాల్సి ఉంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *