త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ పూర్తయింది. అయితే రెండవ షెడ్యూల్ మొదలు పెట్టుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు చిత్ర బృందం. మధ్యలో కొన్ని రోజులు ఈ సినిమా ఆగిపోయిందని, కథ నచ్చకపోవడంతో మహేష్ బాబు ఈ సినిమాను క్యాన్సిల్ చేశాడన్న వార్తలు వినిపించాయి.

కానీ అవన్నీ ఒట్టి పుకార్లే అని ఇటీవల ఈ సినిమాకు ఆయన చేస్తున్న వర్కవుట్ పిక్ బట్టి తెలుస్తుంది. జిమ్ లో ఈ సినిమాకు సంబంధించిన మేకవర్ కోసం ఆయన వర్కౌట్స్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆయన అభిమానులు ఈ ఫోటో విడుదలవ్వడం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా విడుదల అవబోతుంది అని చెబుతున్నారు త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది అన్న వార్తను అధికారికంగా ప్రకటించబోతున్నారట. ఏదేమైనా ఒక పెద్ద హీరో పెద్ద దర్శకుడు కలిసి చేస్తున్న సినిమాకు ఈ విధమైన వార్తలు రావడం నిజంగా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తూ ఉండగా ఈ చిత్రాన్ని హాసిని హారిక బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఎన్టీఆర్ తో చేయవలసిన సినిమా ను కథ బాగాలేదు అన్న కారణంగా మధ్యలో క్యాన్సల్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా ఆ విధంగా అయితే ఆయన కెరీర్ కు ఇబ్బందులు తప్పవని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అవలేదు అని చెప్పడం నిజంగా త్రివిక్రమ్ అభిమానులను ఊపిరి తీసుకున్నట్లు అయింది అని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *