టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు ఇప్పుడు చాలా సినిమాలలోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతంలో వీరు ఏడాదికి ఒక్క సినిమా ను కూడా విడుదల చేసేది అనుమానంగా ఉండేది. కానీ ఇప్పుడు పెరిగిన పోటీ దృష్ట్యా ఒకే ఏడాదిలో రెండు సినిమాల ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలందరూ కూడా ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులు చేస్తూ ఒకేసారి చేస్తూ రేసులో ముందు ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో ఒక సినిమాకు సంబంధించిన విడుదల తేదీ నిర్ణయించబడింది అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఆ సినిమాను ఆ నిర్ణయించిన తేదీ లోనే రోజునే విడుదల చేసేవారు.

కానీ ఇటీవల కాలంలో ఆ విడుదల తేదీలో మార్పులు ఎక్కువగా జరగడం మనం చూస్తున్నాం. ఇది హీరోలకు పెరిగిన ఇన్ సెక్యూరిటీ ఫీలింగును ప్రస్ఫుటం చేస్తుంది అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కథ విషయంలో ఓకే చెప్పిన తరువాత చిత్రీకరణ విషయంలో వారికి ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఆ సినిమాను వాయిదా వేయడం లేదా క్యాన్సిల్ చేయడం పంటివి చేస్తున్నారు.

ఒకరిద్దరు మాత్రమే కాదు అందరూ అగ్ర హీరోలు కూడా ఈ విధంగా తమ సినిమాలను వాయిదా వేయడం వారి అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. మరి ఇలాంటి విడుదల ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే హీరోలు ఏ విధంగా తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *