టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. మంచు మోహన్ బాబు ఒక మామూలు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కలెక్షన్ కింగ్ గా మారిపోయారు. ఇక ఈయన వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్,మంచు లక్ష్మి లు కూడా ఇండస్ట్రీలోకి మన సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ మధ్యకాలంలో మంచు విష్ణు రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆయనపై చాలా వార్తలు వచ్చాయి. మంచు విష్ణు, భూమ మౌనిక అనే అమ్మాయిని త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

ఇక ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.ఇక ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఎక్కువగా ప్రజెంటేషన్ ఆఫ్ మూడ్ ని నమ్ముతాను. అంతేకాదు కొన్ని కొత్త కథలలో మీనింగ్ కూడా ఉండడం లేదు. ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా విజువల్ వండర్స్ కే అట్రాక్ట్ అవుతున్నారు. కథ కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు ఆ కథని కొత్తగా ప్రజెంటేషన్ చేయడం ఎంతో అవసరం.

ఇక ప్రభాస్ లాంటి కటౌట్ హీరోని ఒక యానిమేషన్ హీరోలా చూపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక ఆది పురుష్ సినిమాలో గ్రాఫిక్స్ చేంజ్ చేయకుండా సినిమాని రిలీజ్ చేస్తే మంచి ఫలితాలు రావు. చేంజ్ చేస్తేనే ఈ సినిమాకి మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది ప్రభాస్ అభిమానులు కూడా ఆది పురుష్ సినిమా టీజర్ నచ్చలేదని అంటున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. నేను హీరో మంచు విష్ణుతో ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాను.

మంచు మనోజ్ తో అహం బ్రహ్మాస్మి అనే సినిమా ఆలస్యం కావడం వల్లే నేను మిగతా సినిమా ప్రాజెక్టులపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇక మంచు మనోజ్ సరికొత్త కథలతో ఎంట్రీ ఇస్తారు. అంతేకాదు ఒకవేళ మనోజ్ పాలిటిక్ లోకి వెళితే వెళ్లొచ్చు. అందులో తప్పు పట్టాల్సిన విషయం లేదు. అయితే మంచు మనోజ్ కి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం ఉంది. కావచ్చు అందుకే కొత్త సినిమాల్లో నటించడం లేదు కావచ్చు అంటూ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగేశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *