సినీ పరిశ్రమలో ప్రేమ, డేటింగ్ , పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకున్న వారు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే మరి కొంతమంది ఎదిరించి వివాహం చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ప్రేమ వరకే కలిసి ఉండటం, డేట్ లతో కాలక్షేపం చేస్తూ ఉండడం, బిడ్డ పుట్టిన తర్వాత ఒకరికొకరు దూరం అవ్వడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా హీరో, హీరోయిన్స్ మధ్య రిలేషన్స్ ఉండడం సహజం. కానీ ఇక్కడ ఒక మహిళ నిర్మాతతో ఒక యంగ్ హీరో డేటింగ్ చేస్తున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అసలు సినీ పరిశ్రమలో మహిళా నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. ఇకపోతే కొంతమంది మహిళలు మాత్రమే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అందులో ఒక నిర్మాత యువ హీరోతో ప్రేమాయణం సాగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . నిర్మాత – హీరో తమ రిలేషన్షిప్ ని సీక్రెట్ గా ఉంచడానికి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారట. కానీ వారి బంధం గురించి హీరో కుటుంబ సభ్యులకు తెలిసింది అని భయాందోళనలో ఉన్నప్పటికీ ..ప్రస్తుతానికి వారికి ఎలాంటి సమస్య లేదని కూడా తెలుస్తోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. హీరో కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరిది కేవలం స్నేహం మాత్రమే అనుకుంటున్నారట.

కానీ స్నేహం పేరిట వీరు లోపల చేసే పనులు ఏ సమస్యను తీసుకొస్తాయి అని కొంతమంది భావిస్తున్నారు ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఒక హీరోయిన్ నిర్మాతతో సహజీవనం చేసింది. ఆ నిర్మాత సహాయంతో ఆఫర్లు కూడా అందుకుంది. ఈ క్రమంలోనే అతనితో ఆ హీరోయిన్ చాలా దూరం వెళ్లిందని ఆమెపై కథనాలు కూడా వచ్చాయి. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఇలాంటి కథనాలను పెద్దగా లెక్క చేయలేదు తనుకు అవకాశాలే ముఖ్యం అని అనుకుంది.

కానీ ఆ తర్వాత ఆ నిర్మాత ఫామ్ కోల్పోయాడు ఇక అతనితో ఉంటే ఎలాంటి ఉపయోగం లేదని ఆలోచించిన హీరోయిన్ అతడిని దూరం పెట్టేసింది.ఇలా చాలా విషయాలు ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరుగుతూ ఉండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *