స్టార్ హీరోయిన్గా నటించిన హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు . ఈ ముద్దుగుమ్మ చూడ చక్కని అందం ఆకట్టుకునే అభినయంతో ఎంతోమంది తెలుగు, తమిళ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో ప్రియమైన నీకు , హనుమాన్ జంక్షన్, వెంకీ, రాజన్న వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అయితే అందుకుంది. కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ తమిళ నటుడు ప్రసన్న కుమారును వివాహం చేసుకుందట. గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు అయితే చాలా వైరల్ గా మారాయి. వీరికి ప్రస్తుతం పిల్లలు ఉన్నప్పటికీ వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనే ప్రచారం చాలా తెగ వైరల్ గా మారింది.

దీంతో ఈ విషయంపై స్నేహ సీరియస్ గా స్పందించిన స్నేహ ప్రసన్న విడిపోతున్నారనే వార్తలపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్న ఒక క్లోజ్ ఫోటోని షేర్ చేసి అందరి నోరు మూయించింది. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా తన భర్త షోయబ్ మాలికతో విడిపోతున్నారు అనే వార్తలు కూడా గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలలో కూడా నిజం లేదంటే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సానియా దంపతులు.

అయితే కొంతమంది కావాలని ఇలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని సినీ సెలబ్రిటీల సైతం ఇలాంటి వార్తలతో ఎంతో సతమతమవుతున్నారని కొంతమంది సినీ ప్రముఖుల సైతం తెలియజేయడం జరుగుతొంది. సోషల్ మీడియాలో కావాలని ఇలాంటివన్నీ ఎక్కిస్తున్నారని ఇప్పటికే కొంతమంది సినీ తారులు విడిపోయినప్పటికీ మరి కొంతమంది మాత్రం కావాలని ఇలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో వాళ్ళ తమ విషయాలపై క్లారిటీ ఇవ్వవలసి వస్తోందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి వార్తలు ఎన్ని వస్తాయో మరి…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *