రానున్న సంక్రాంతి ని దృష్టి లో పెట్టుకొని టాలీవుడ్ చలన చిత్ర నిర్మాతలు దసరా, సంక్రాంతి వంటి పండుగల టైం లో డబ్బింగ్ సినిమాల విడుదల కంటే తెలుగు చిత్రాల విడుదలకే ప్రాధాన్యత ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలలోని చలనచిత్ర నిర్మాతలు ఎగ్జిబిటర్లను కోరారు.

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ విడదల చేసిన ఓ న్యూస్ లో పండుగల టైం లో థియేటర్లలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలని కమిటీ పేర్కొంది. వచ్చే 2023లో సంక్రాంతి చివర్ర్లో రెండు పెద్ద తమిళ మూవీస్ వరిసు, తునివు రిలీజ్ కానున్నాయి. ఆ రెండు మూవీస్ వలన తెలుగు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఐతే తెలుగు చలనచిత్ర నిర్మాతల కమిటీ ఆ పత్రికా ప్రకటనలో చెప్పింది ఏంటంటే పెరిగిన తెలుగు సినిమాల ఖర్చు , నిర్మాతల సంక్షేమం, తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడటానికి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తన ఎమర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 08.12.2019 నుండి సంక్రాంతి, దసరా ఫెస్టివల్స్ టైం లో కేవలం తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్‌లకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే తీర్మానాన్ని చేసింది.

దీనిపై ఫిల్మ్‌ చాంబర్‌ ఉపాధ్యక్షుడు ఐనటువంటి దిల్‌రాజు 2019లో అదే టాపిక్ ని గుర్తుచేసారని చెప్పారు. తెలుగు మూవీస్ ఉండంగా డబ్బింగ్‌ మూవీస్ లకు ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారని గతంలో దిల్‌ రాజు ప్రశ్నించారు. కనుకనే ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు కచ్చితంగా పాటించాలని లేఖలో వివరించింది. సంక్రాతి, దసరా ఫెస్టివల్స్ టైం లో తెలుగు మూవీస్ లకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ మిగిలిన కొన్ని థియేటర్ లకు డబ్బింగ్ మూవీస్ లకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎగ్జిబిటర్స్‌ను కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *