మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు రాంచరణ్. ఇక ఈయన చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలతో తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యనే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా గుర్తింపు సంపాదించారు. తాజాగా రాంచరణ్ జపాన్ వెళ్లి తిరిగి ఇండియాకు వచ్చే క్రమంలో ఢిల్లీలో నిర్వహించిన హిందూస్తాన్ టైం లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొనడం జరిగింది.

ఇక ఈ సమ్మిట్ లో బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ రాగా సౌత్ నుండి రామ్ చరణ్ వచ్చారు. ఇక ఒకే వేదికపై అక్షయ్ కుమార్,రామ్ చరణ్ ఇద్దరు హీరోలను చూసి ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. అంతేకాకుండా అక్కడ మీడియా వారిని కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది. అలాగే ఈ ఇద్దరు హీరోలు కలిసి తెలుగు, హిందీ పాటలకు డ్యాన్సులు కూడా చేశారు. ఇక వీరి డాన్స్ కు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఇక రాంచరణ్ ని ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఇంట్రో సీన్ గురించి అడగడం జరిగింది.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రో సీన్ ఎంత అద్భుతంగా ఉందో మనం ఇప్పటికే చూసాం. ముఖ్యంగా ఈ సన్నివేశంలో వేలాదిమంది మధ్యలో రామ్ చరణ్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇవ్వడం కేవలం మెగా అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది. అంతలా తన నటనతో అందరికీ గుర్తిండి పోయాలా ప్రదర్శించారు రామ్ చరణ్. ఇక ఈ సన్నివేశం గురించి రాంచరణ్ మాట్లాడుతూ.. ఈ సీన్ తీయడానికి నాకు దాదాపు 30 రోజులు పట్టింది. అయితే ఈ ఎంట్రీ సీన్ కేవలం డస్టులోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి 30 రోజులు పట్టింది.

దానికి కారణం నాకు “సైనస్ ప్రాబ్లం డస్ట్ ఎలర్జీ” ఉంది అందుకే ఇన్ని రోజులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ సీన్ లో 3000 మంది జనాలు ఉన్నారు. ఇక వారిలో దర్శకుడు ఎక్కడ ఉన్నాడో కూడా కనిపించలేదు. ఆయన ఎక్కడో దూరంగా ఉండి ఓ వైట్ క్లాత్ సిగ్నల్ ఇస్తూ ఉండేవారు. అంతేకాదు ఎంట్రీ సీన్ కోసం మేము చాలా కష్టపడ్డాం. ఇక మా కష్టానికి తగ్గ ఫలితం కూడా ఈ సినిమా సక్సెస్ ద్వారా దక్కింది అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *