తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సినీ ఇండస్ట్రీలో ఒక పాత్రలో నటిస్తోంది అంటే కచ్చితంగా పాత్రకు ప్రాణం పోస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.. తన ముఖ కవళికలతో గ్లిజరిన్ లేకుండానే కన్నీటిని తెప్పించి పాత్రలో లీనం అయిపోయి ఆ పాత్రకు జీవం పోసేది. అంతలా తన నటనతో మహానటిగా మారిపోయింది సావిత్రి. అయితే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తెలుగు, తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సావిత్రి తన హయాంలో ఎంతోమందికి దానధర్మాలు చేసింది.

Savitri-Gemini Ganesan love story: Botched affair to the bottleఅయితే కెరీర్ తొలినాళ్లలో తమిళ నటుడు జెమినీ గణేషన్ తో ఈమెకు ఏర్పడిన పరిచయమే ఈమె నాశనానికి కారణమైందని చెప్పాలి. సావిత్రితో పరిచయం ఏర్పడిన నాటికి జెమినీ గణేషన్ కి అలమేలు గణేషన్ అనే అమ్మాయితో 1940లో వివాహం జరిగింది. అయితే ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత కూడా అతడు సావిత్రిని మోహించి ఆమెను వివాహం చేసుకున్నారు. అలా 1952లో కుటుంబాన్ని కూడా కాదని కుటుంబాన్ని ఎదిరించి మరి వివాహం చేసుకుంది సావిత్రి. కుటుంబాన్ని ఎదిరించి ఆమె ప్రేమ వివాహం చేసుకోవడమే ఆమె కెరియర్ పతనానికి ప్రధాన కారణం అని చెప్పాలి.అయితే కొన్ని సంవత్సరాలు పాటు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. కానీ ఉన్నట్టుండి కొన్ని అనుకొని సంఘటన కారణంగా జెమినీ గణేషన్కు ముందే వివాహమైంది అనే విషయాన్ని తెలుసుకుంది సావిత్రి.

అయితే జెమినీ గణేషన్ తన తప్పులను అంగీకరించకపోగా మరొక అమ్మాయితో పడకగదిలో ఉండడం సావిత్రి చూసి నిర్గాంత పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన కూడా ఆమెనే నిందించే ప్రయత్నం చేశారు జెమినీ గణేషన్. కానీ ఎట్టకేలకు తన భర్త నుంచి దూరం కావాలని ఆలోచించిన సావిత్రి 1981లో అతడికి శాశ్వతంగా దూరమైపోయింది . అయితే అతడినే ఆరాధ్య దైవంగా భావించిన సావిత్రి జెమినీ గణేషన్ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక తాగుడుకు బానిస అయ్యింది. అలా ఉన్న ఆస్తిని మొత్తం కోల్పోయి చివరికి ఎవరూ లేని అనాధగా మరణించడం చాలా బాధాకరమైన చెప్పాలి.

అయితే అక్కడితో ఆగకుండా జూలియన గణేషన్ అనే అమ్మాయిని 1997లో మూడవసారి వివాహం చేసుకొని ఆమెకు 2005 లో విడాకులు ఇచ్చేశాడు . అలాగే తన మొదటి భార్య అలమేలు గణేషన్ కి కూడా 2005లో ఆయన విడాకులు ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే ఆరాధ్య దైవంగా జెమినీ గణేషన్ ను పూజించిన సావిత్రికి చివరికి తీరని దుఃఖం మిగిలిందనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *