బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ గా చేస్తూ పెళ్లి చేసుకున్న రణ్‌బీర్‌- ఆలియా, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌- బిపాసా బసు దంపతులు ఇటీవల తమ ఇళ్ళల్లో చిన్ని పాపాయికి వెల్కమ్ చెప్తూ తల్లిదండ్రులైన విషయం అందరికి తెలిసిందే.

ఐతే లేటెస్ట్ గా ఇంకో హీరో కూడా అదే లిస్ట్ లో ఎక్కనున్నడని తెలుస్తుంది మరీ అది నిజమో లేదా అలా చెప్పిన స్టార్ జోక్ చేశాడా అని తెల్సుకుందాం. ‘భేదియా’ మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా హీరోయిన్‌ కృతీ సనన్‌ను తీస్కొని వరుణ్ధావన్ బిగ్‌బాస్‌ పదహారు సీజన్‌కు వెళ్లాడు. అలా వెళ్లిన వారితో కాసేపు సరదాగా గేమ్స్ ఆడించాడు మన సల్లుభాయ్. ఈ ఆటల్లో భాగంగా ఒక బొమ్మను వరుణ్ధావన్ చేతిలో పెట్టి ఈ బొమ్మ మీ బాబు కోసమే అని అన్నాడు. దాంతో బాగా సిగ్గుపడిపోయిన వరుణ్ అవును నేను ఈ బొమ్మను ఏంచేస్కుంటాను నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అని అన్నాడు మన యంగ్ హీరో వరుణ్.

దానికి సల్మాన్‌ ఆ బొమ్మను నువ్వు ఇంటికి తీసుకెళ్తే మీ ఇంట్లో నిజాంగానే త్వరలో బాబు వస్తాడు అని సరదాగా చెప్తాడు.దీన్ని సోషల్ మీడియా ద్వారా చూసిన నెటిజన్లు సల్మాన్‌ సరదాగా అన్నాడా? లేక వరుణ్ దంపతులు నిజంగానే తల్లిదండ్రులు కాబోతున్నారా?అని ట్వీట్ చేస్తున్నారు. ఐతే సల్మాన్‌ రీసెంట్ గా బిగ్‌బాస్‌ హౌస్‌లో థాంక్‌ గాడ్‌ ప్రమోషన్స్‌ లో భాగంగా సిద్దార్థ్‌ను దృష్టిలో పెట్టుకొని త్వరలో అతని మ్యారేజ్ జరగబోతుందని చెప్పాడు అది నిజమైంది. దింతో సల్మాన్ హీరోగానే కాదు జ్యోతిష్యుడు గా మరీ పోయారని నేటిజన్లు సరదాగా అంటున్నారు.

అందుకే వరుణ్‌ విషయంలో కూడా అది జోక్‌ కాదని, ఇది కూడా ఒక హింటే అంటున్నారు నేటిజన్లు.ఐతే గతేడాది వరుణ్‌, నటాషా ల మ్యారేజ్ 2021 జనవరిలో చేసుకున్నారు.వరుణ్‌ నటించిన భేదియా మూవీ నవంబర్‌ 25న రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *