బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు ఢీ వంటి డాన్స్ కార్యక్రమాలకి కూడా వ్యవహరించి పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు అవకాశం వచ్చిన చోట సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను తెలిపింది.

ఇదిలా ఉండగా రష్మీ మాట్లాడుతూ.. ప్రయోగాత్మక సినిమాలలో నటించడానికి ఇష్టపడతాను. నా దగ్గరకు వచ్చిన పాత్రలలో ఆసక్తి కలిగించే పాత్రలు ఎక్కువగా ఇష్టమని ఆమె తెలిపింది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలని ఎన్నోసార్లు అనిపించింది. అయితే తల్లికి ఆరోగ్యం బాగోలేని సమయంలోనే అలా అనిపించింది అని రష్మీ తెలిపింది. ఇక ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అంటూ కూడా ఆమె తెలపడం గమనార్హం. ఒకసారి యాక్టర్ అయిన తర్వాత మరో ఉద్యోగం చేయడం సాధ్యం కాదు. మంచి పాత్రలు చేసిన తర్వాత రెగ్యులర్ జాబుకు వెళ్లిన వాళ్లకు హ్యాట్సాఫ్ అని రష్మీ కామెంట్లు చేసింది.

అంతేకాదు ఆమె మాట్లాడుతూ.. నేను వేరే ప్రొఫెషన్ లోకి వెళ్లాలని అనుకున్నానని.. అలా వెళ్తే మాత్రం ఆ టార్చర్ అనేది మామూలుగా ఉండదు.. అని కూడా కామెంట్లు చేసింది. అందరికీ అన్ని సబ్జెక్టులలో 100% రాదని, ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ పదేళ్ల క్రితం లేదు అని కూడా తెలిపింది. ఇప్పుడు నాకు పెద్ద మ్యాటర్ కాదు అని, జనాలకి కూడా గాసిప్స్ కావాలి అని, ఆమె కామెంట్లు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. అంతేకాదు ఒకసారి ఇండస్ట్రీలో సిస్టర్స్ క్యారెక్టర్ పోషిస్తే మళ్లీ అలాంటి పాత్రలే వస్తాయని , సిస్టర్ , ఫ్రెండ్ రోల్స్ లో నటించము అని చెబితే ఆఫర్లు ఇవ్వడానికి ఇష్టపడరు అని కూడా ఆమె తెలిపింది.

జబర్దస్త్ ద్వారానే తన కెరియర్ కు బ్రేక్ పడింది అని, టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు అని కూడా రష్మీ వెల్లడించింది. మొత్తానికైతే రష్మీ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *