స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్గెస్ట్ సినిమా “పుష్ప: ది రైజ్”.

రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా లోని మొదటి భాగం గతేడాది డిసెంబర్ 17న థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందదో అందరికి తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది.

అయితే మరొక నెలలో ఈ సినిమా విడుదల అయ్యి సంవత్సరం గడుస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకి సీక్వెల్ అయిన “పుష్ప: ది రూల్” గురించి ఒక మంచి వీడియో విడుదల చేస్తే బాగుంటుంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 17న “పుష్ప” రిలీజ్ యానివర్సరీ సందర్భంగా “పుష్ప: ది రూల్”లో పుష్ప రాజ్ పాత్ర జర్నీ గురించి ఒక ఆస్తికరమైన మేకింగ్ వీడియో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది..

ఇది అభిమానులకు కచ్చితంగా ఒక పెద్ద సర్ప్రైజ్ కాబోతోంది అని చెప్పవచ్చు.. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా లో కూడా రష్మీక మందాన్న హీరోయిన్ గా నటిస్తోందట.అనసూయ భరద్వాజ్, ఫాహాధ్ ఫాసిల్, సునీల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుందని బ్యాంకాక్ లో కూడా ఈ సినిమా షూటింగ్ జరగనుందట.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *