పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంచల నిర్ణయం తీసుకోవడం జరిగిందట. ఇకపై ఆయన ఒప్పుకున్న మూడు సినిమాలను ప్రేక్షకులందరికీ తీసుకురావాలని ఆయన భావించగా ఇప్పుడు ఆయన ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడట.

దాంతో ఒప్పుకున్న మిగతా రెండు సినిమాలను కూడా ఆయన క్యాన్సల్ చేస్తున్నాడట. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ కేవలం ఆ ఒక్క సినిమాను చేసిన తర్వాత ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉండాలని భావించాడట. ఇప్పటికే ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాకు టైం సరిపోవటం లేదు మధ్య మధ్యలో ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు ప్రజల సమస్యలపై పని చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయవలసిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాను అలాగే తమిళ సినిమా రీమేక్ ను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు అన్న వార్తను ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాల యొక్క దర్శకులకు మేరే సినిమాలు చేసుకోవాల్సిందిగా పవన్ ఇప్పటికే వెల్లడించాడట.

ఏదేమైనా ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి ఎదురుచూస్తున్న నిర్మాతలకు ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి ఆ అడ్వాన్సులు వెనక్కి వస్తాయా లేదా ఆయన మళ్ళి సినిమాలు చేస్తారా అన్న విషయం త్వరలోనే తీరని ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *