నయనతార గురించి తెలియని వారు ఉండరంటే వుండరు.. ఎప్పటినుండో తమిళ చిత్ర పరిశ్రమలో పాగా వేసిన హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఆమెకు అక్కడ సూపర్ స్టార్ హోదా కూడా వుంది

సిల్వర్ స్క్రీన్ పై హీరోల తరువాత ఒక హీరోయిన్ కి అంత మర్యాద దక్కడం ఆమెకే సొంతం.అందుకే ఆమెకి అంత డిమాండ్. ఆమె ఎంత పాపులర్ అయినప్పటికీ అంతే రకంగా వివాదాలు ఆమెని ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటాయి. ఈమధ్య నయనతార టైం అస్సలు బాలేదు. సరోగసి ద్వారా ఈమధ్యనే నయన్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

కాగా ఆ విషయం పెద్ద దుమారాన్నే రేపింది. అది చాలదన్నట్టు తాజాగా ఆమెని మరో సమస్య ప్రమాదంలో నెట్టింది. నయన్ – విఘ్నేల్ లు పెళ్లికి ముందే కొన్నాళ్లు డేటింగ్ చేశారని కూడా తెలిసిందే. అయితే అప్పటికే వీళ్లిద్దరూ కలిసి సౌదీలో పెట్టుబడులు కూడా పెట్టారట. ఓ కంపెనీలో ఇద్దరు కలిసి పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.. అయితే అప్పటికి వీళ్ళకి ఇంకా పెళ్లి కాకపోవడంతో ఆ అగ్రిమెంట్లో వీళ్ళిద్దరూ విడివిడిగానే సంతకం కూడా చేశారట. ఇక ఇటీవల కవల పిల్లల విషయంలో వీరు ప్రభుత్వానికి.. మేము ఆరేళ్ల ముందే పెళ్లి చేసుకున్నాం అంటూ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా చూపించడం జరిగింది.

ప్రస్తుతం వీరిని ఇదే విషయం సమస్యల్లో నెట్టేట్టు కనిపిస్తోంది. ఎప్పుడో పెళ్లి జరిగిందని చెప్పి ఒక చోట.. మరో చోట మేము సపరేట్ అని డాక్య్యూమెంట్ ఫ్రూఫ్ తో సహా దొరకడంతో.. లీగల్ గా వీరికి సమస్యలు చుట్టుముట్టినట్టు తమిళనాట వార్తలు గుప్పుమంటున్నాయట.ఒకవేళ నిజంగా మీకు పెళ్లి అయ్యి ఉంటే అప్పుడు ఎందుకు మీరు విడివిడిగా సైన్ చేశారు అంటూ ప్రభుత్వం ప్రశ్నించే ఛాన్స్ లేకపోలేదని అక్కడి మీడియా ఛానళ్ళు కోడై కూస్తున్నాయి. సరోగసి సమస్య ఒక కొలిక్కి వస్తుంది అనుకున్న టైమ్ లో ఇలా జరగడంతో అంతా కూడా షాక్ అవుతున్నారని తెలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *