ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎప్పుడు ఎవరు గొడవపడతారో.. ఎవరెవరి మధ్య వార్ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో సమకాలిన నటుల మధ్య ఎప్పటినుంచో వుండే వాళ్లు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి . తరువాత డైలాగ్ కింగ్ మోహన్ బాబు వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది ? అనేది తెలియకపోయినా వీరి మధ్యన ఒక కోల్డ్ వార్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక ఈ విభేదాలు మొదటిసారిగా బయటపడింది. తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో లెజెండ్ ఎవరు? సెలబ్రిటీ ఎవరు? అన్న గొడవ తారాస్థాయికి చేరి చిరంజీవి అవార్డును తీసుకోవటానికి అర్హుడవు కావు అని మాట్లాడారు మోహన్ బాబు.. అయితే ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

మొదటిసారిగా చిరంజీవి లెజెండ్ అంటూ చెప్పడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన మోహన్ బాబు వేదిక మీదే నీ కంటే గొప్పవారు నాగేశ్వరరావు, కృష్ణ వంటి వారున్నారు. ఇక కృష్ణ గారైతే సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేశారు. ఇండస్ట్రీకి కొత్త ట్రెండు తీసుకొచ్చిన వ్యక్తికి లేని గౌరవం నీకెందుకు ఇస్తారు అంటూ మాట్లాడారు. ఈ అవమానానికి చిరంజీవి గారు ఈ అవార్డు అందుకునే అర్హత నాకు లేదని చాలామంది అసూయగా అంటున్నారు.ఇప్పటికే కెరీర్ లో ఈ స్థాయికి రావడానికి చాలా అవమానాలు పడ్డానని, అవన్నింటినీ భరించి వస్తే మళ్లీ అదే చేస్తున్నారు కొంతమంది అంటూ మాట్లాడారు.

నాకి అవార్డు అందుకొని అర్హత లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.. కాబట్టి నాకు ఈ అవార్డు వద్దు మరో 25 ఏళ్ల తర్వాత నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సినిమా వేడుకలు చేసినప్పుడు ఎవరు లెజెండ్? ఎవరు కాదో? నిర్ణయం ప్రజలే తీసుకుంటారు అంటూ టైం క్యాప్సిల్స్ లో అవార్డును ఉంచారు. అయితే భరద్వాజ గారు మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఆవేశంలో ఉండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడి తనకు అవార్డు ఇచ్చిన వారిని అవమానించకుండా అలానే తనని అవమానించిన వాళ్లకు అలాగే వారి వెనుక ఉన్న వాళ్లకు కొట్టినట్టు సమాధానం చెప్పారు. అంటూ భరద్వాజ గారు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *