సమంత-నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇక వీరి జంట చూసి చాలా మంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఇక విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకొని ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. చాలా రోజుల నుండి సమంతా నాగ చైతన్య మళ్లీ కలుస్తారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు సమంత మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు స్వయంగా నాగచైతన్య ఫోన్ చేసి ఆమె క్షేమ సమాచారం అడిగారని,మరికొందరేమో డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి సమంతను కలిశాడంటూ, ఇంకొంతమందేమో ఏకంగా ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు అంటూ ఇలా రకరకాల వార్తలు వీరిపై పుట్టుకొచ్చాయి. దీంతో వీరి పేర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ యశోద ప్రమోషన్స్ లో పాల్గొని ఓ ఎమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. దీంతో సమంత ను చూసిన ప్రతి ఒక్కరూ బాధపడ్డారు.

ఇక సమంత నటించిన యశోద సినిమా కూడా పాజిటివ్ టాక్ తో ముందుకు పోతూ కలెక్షన్ల పరంగా బాగానే వసూళ్లు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ కూడా అయింది. ఇక తాజాగా నాగచైతన్య సమంతల మీద మరొక కొత్త వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. నాగచైతన్య సమంత మళ్లీ కలవబోతున్నారట. కలవడం అంటే మళ్ళీ వివాహ బంధంతో కాదు ఓ సినిమా కోసమట. ఓ సినిమాలో మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి నటించనున్నారట. ఇక ఈ వార్తలు జాతీయ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం లీక్ అవడంతో వీరిద్దరూ కలిసి నటించడం ఎలా సాధ్యమవుతుంది? అంటూ నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు.

ఎందుకంటే సమంత ఇంతకుముందే కరణ్ జోహార్ షో లో పాల్గొని మా ఇద్దరినీ ఒకే రూమ్ లో ఉంచితే చుట్టుపక్కన పదునైన వస్తువులు ఏవి లేకపోతే బెటర్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. నాగచైతన్య మీద ఎంత కోపం ఉందో చెప్పగానే చెప్పేసింది. అంతేకాదు అతని మీద ఏమాత్రం ఇష్టం లేనట్లుగా, కనీసం కలిసి నటించేందుకు కూడా సమంత ఒప్పుకోవడం లేదు. కానీ నాగచైతన్య మాత్రం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సమంత నాకు ఇంకా స్నేహితురాలే.మేమిద్దరం కలిస్తే ఫ్రెండ్లీగా ఓ హగ్గు కూడా ఇస్తాను అంటూ చెప్పేసారు. అలాగే మీరు మళ్ళీ కలిసి నటిస్తారా అంటే ఏమో నటిస్తాం కావచ్చు కానీ ఒకవేళ అది జరిగితే క్రేజీ అంటూ నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పేసాడు. మరి జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో నటిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *