తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు హరీష్ రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారు కౌంటర్ ఇచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.

తెలంగాణ లోని కాలేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే స్టార్ట్ ఐనా పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని ఆయన ఏద్దేవ చేసారు. నేను పోలవరం పనులు ఎప్పుడు కంప్లీట్ అవుతుందని నేనుఅక్కడున్న ఇంజనీర్ ను అడగగా ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియదని అన్నాడు.

ఐతే అలా హరీష్ రావు చేసిన కామెంట్స్ పై ఏపీ జల వనరుల శాఖామంత్రి ఐనా అంబటి రాంబాబు చాలా నిదానంగా రియాక్ట్ అయ్యారు. ఆయనకు ఇలా నిదానంగా సెటిర్లు వేయడం కొట్టేమి కాదు. ఐతే తనదైన స్టైల్ లో హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు.ఏవిధంగా అన్నారంటే ‘తెలంగాణ ప్రభుత్వం గొప్పదనాన్ని చెప్పాలనుకున్నారో లేదా , వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అవమానిద్దామని అనుకున్నారో తెలియదు గాని, కాలేశ్వరం ప్రాజెక్టు వేరు, పోలవరం ప్రాజెక్టు వేరు, కాలేశ్వరం ఓన్లీ 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి చిన్న బ్యారేజీ అదంతా కంప్లీట్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోలవరం అనేది అలా కాదు ఇది బహులార్ధకమైన ప్రాజెక్టు. దీని కెపాసిటీ 196 టిఎంసి స్టోర్ చేసుకొని గ్రావిటీ ద్వారా నీరు తరలిస్తాం. ముందు పోలవరం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని తెల్సుకోవడం మంచిది కాదా అని అన్నారు.

ఐతే ఈ రెండు ప్రాజెక్ట్స్ లకు చాలా తేడా ఉందని దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. అది ఇపుడు సోషలమీడియాలో తెగవైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *