అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఇక ఈమె మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాల్లో నటించింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. అయితే హన్సిక ఈ మధ్యనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఆఫీషియల్ గానే ప్రకటించింది. ఇక చాలా రోజుల నుండి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఎక్కడా కూడా ఈ విషయం గురించి నోరు విప్పలేదు.

కానీ ఈ మధ్యనే తాను నిజంగానే పెళ్లి పీటలేకపోతున్నాను అంటూ చెప్పి అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. హన్సిక ముంబైకి చెందిన సోహెల్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే సోహెల్ కి ఇప్పటికే పెళ్లయిపోయింది. ఇక సోహెల్ మొదట పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు హన్సిక ఫ్రెండ్ నే . సోహెల్ హన్సిక బెస్ట్ ఫ్రెండ్ ని వదిలేసి మళ్లీ హన్సికను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో వీరి పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక హన్సిక తన పెళ్లిలో ఎవరు చేయని ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే తన పెళ్లికి సంబంధించిన అన్ని షాపింగ్ పనులను కంప్లీట్ చేసిందట.

అంతేకాదు తన పెళ్లి కోసం స్పెషల్ గా నగలను డిజైన్ చేయించుకొని పెళ్లిలో వాటిని వేసుకొని రాయల్ లుక్ లో మనకు కనిపించబోతుందట. ఇక హన్సిక పెళ్లికి కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి రాయల్ గా పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే హన్సిక తాజాగా తన పెళ్లి విషయంలో ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే..సాధారణంగా ఎవరి పెళ్లిలో అయినా ముందుగా అబ్బాయి పెళ్లి పీటల మీదకి వస్తాడు.ఆ తర్వాత అమ్మాయిని తీసుకొస్తారు. ఇక ఇదే సాంప్రదాయం ఎవరి పెళ్లిలో అయినా కొనసాగుతూ వస్తోంది.

కానీ హన్సిక మాత్రం తన పెళ్లిలో మేమిద్దరం ఎందులో తక్కువ కాకూడదు, మేమిద్దరం సమానమే, అలాగే మా ఆలోచనలు, మనసులు ఒకే విధంగా ఉంటాయి.కాబట్టి మేమిద్దరం ఒకేసారి పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇస్తాం అంటూ చెప్పుకొచ్చిందట. అంతే కాదు హన్సిక తన పెళ్లి టైం లో మండపం ఎక్కాక ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తా అంటూ తన స్నేహితులతో చెప్పుకొచ్చిందట. ఇక ఈ సర్ప్రైజ్ చూస్తే సోహెల్ కచ్చితంగా షాక్ అవుతాడు అని హన్సిక తన స్నేహితులతో చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే హన్సిక తన పెళ్లిలో ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతుందో అంటూ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *