పవన్కళ్యాణ్ టాలీవుడ్ లో చిరు తమ్ముడిగా ఏంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో రాణించి తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక పేజీ ఉన్నట్లు గా చేసుకున్నాడు.హిట్ ప్లాప్ లతో అవసరంలేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తాయి హీరోలకు మాములుగా ఐతే ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. ఎందుకో అభిమానులు ఆయన్ని దేవుడుగా కొలుస్తారు అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ ను అభిమానించే సెలబ్రెటీలు, వ్యక్తులు చాలా మంది ఉన్నారు.

ప్రస్తుతం ఆయన సినిమాలు మరియు రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు.రాజకీయాల వల్ల అప్పటి దాక అభిమానించే నేతలు కూడా విమర్శిస్తున్నారు. జనసేన అధినేతపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర విమర్శలు చేస్తూంటారు. వారిలో పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, కోడలి నాని, కురసాల కన్నబాబు వంటి వారుబాగా పవన్ కళ్యాణ్ పై మాటలతో దాడి చేస్తూంటారు.

ఐతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ నేత ఐనటువంటి మాజీ మంత్రి కొడాలి నాని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను బాగా అభిమానించేవారట.అలాగే కొడాలి నాని రాజకీయాల్లోకి అడుగు పె ట్టకముందు మూవీ డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా చేశారన్న సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమాను కృష్ణా జిల్లాలో విడుదల చేసారు.

గుడివాడ ఎమ్మెల్యే ఐనా మాజీ మంత్రి కొడాలి మూవీ ఎగ్జిబిటర్ గా చేస్తున్న టైం లో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన జల్సా ని కొనుగోలు చేశారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అప్పట్లో ఒక లెవెల్ లో సూపర్ హిట్ అయిన జల్సా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ ను క్రాస్ చేసింది. అలాగే ఆ టైం లో కృష్ణాజిల్లాలో ఎక్కువగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా అది సరికొత్త రికార్డ్ ను కూడా సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *