బాలీవుడ్ బాద్ షా అయిన షారుక్ ఖాన్ కథానాయకుడిగా `పఠాన్`..`జవాన్` చిత్రాల షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు సినిమాలు కూడా ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్లి వాటిని పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పఠాన్ చిత్రీకరణ క్లైమాక్స్ కి చేరుకుంది. దీంతో పూర్తి స్థాయిలో `జవాన్` పై దృష్టిసారించే దిశగా అడుగులు వేస్తున్నారట .

అయితే మరోవైపు రాజ్ కుమార్ హిరానీ షారుక్ని వెంటాడుతున్నారు. ఆయన దర్శకత్వంలో `డుంకీ` తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సన్నాహాలు అయితే చేస్తున్నారు. దీనిలో భాగంగా పఠాన్ పూర్తయిన వెంటనే సైమల్టేన్నియస్ గా `డుంకీ` షూట్ లోనూ జాయిన్ అవ్వడానికి అయితే రెడీ అవుతున్నారు.

దీనిలో భాగంగా పదిహేను రోజుల పాటు సౌదీ అరేబియాలో ఓ షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ..షారుక్..తాప్సీ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.. దీనిలో భాగంగా షారుక్ అతి త్వరలోనే సౌదీ ప్లైట్ కూడా ఎక్కబోతున్నారని సమాచారం.. ఈ షెడ్యూల్ తర్వాత పంజాబ్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే రాజ్ కుమార్ హిరాణీ ఆధ్వర్యంలో షారుక్ లేని సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది. షారుక్ బిజీ షెడ్యూల్ కారణంగా ఇంతకాలం వెయిట్ చేసిన హిరాణీ ఇక ఆగేది అయితే లేదని..షారుక్ పై సైతం ఒత్తిడి తీసుకు రావడంతో బాద్ షా డుంకీ రింగ్ లోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు.

ఆ ప్రకారమే షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ జరిగింది. అయితే అనూహ్యంగా `జవాన్` కూడా మొదలవ్వడంతో షారుక్ డేట్ల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.అయినా ఎలాంటి జాప్యం లేకుండా షారుక్ `డుంకీ` కి డేట్లు కేటాయించడంతో డిలే జరగడానికి ఛాన్స్ లేదని తెలుస్తోంది. షారుక్ లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తోన్న చిత్రాలివి. వరుస పరాజయాల నేపథ్యంలో కంటెంట్ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకొస్తున్నారు. హిట్ తో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారని తెలుస్తుంది..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *