హరి హరీష్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో సమంత కీలక పాత్రలో నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం యశోద. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు ఉన్ని ముకుందన్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే నవంబర్ 11వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే సమంత కోసం ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్స్ రంగంలోకి దిగారు. ఇకపోతే శ్రీదేవి మూవీ బ్యానర్స్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం లో సమంత తోపాటు ఐదుగురు హీరోయిన్స్ నటించడం సినిమాకే హైలైట్ అని చెప్పాలి.

Interview : Kalpika Ganesh, Divya Sripada & Priyanka Sharma – We did Yashoda  for its exciting storyline | 123telugu.comఈ సినిమాకు తెలుగు వర్షన్ డైలాగ్స్ తెలుగు జర్నలిస్టులు పులగం చిన్న నారాయణ, డాక్టర్ చెల్లా భాగ్యలక్ష్మి అందించడం మరో విశేషం..రామజోగయ్యశాస్త్రి, చంద్రబోస్ లిరిక్స్ అందించగా ఈ సినిమాకు మార్తాండ కే వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరించారు. మొత్తానికి అయితే ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం. ఈ సినిమాలో సమంతతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు కూడా నటించారు. అయితే వారు ఎవరు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

Varalaxmi joins Samantha's 'Yashoda'

ఇకపోతే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ నెగిటివ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఈమె తమిళంలో శింబు సరసన పోడా పోడి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్రాక్ సినిమా నుంచి నెగటివ్ పాత్రలని చేస్తూ వస్తోంది.ఇక ఆ తర్వాత సమంతతో స్నేహం చేసే పాత్రలో కల్పికా గణేష్ కనిపించారు.. వాస్తవానికి ఈమె కూడా హీరోయిన్.. ప్రయాణం సినిమాతో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత ఆరెంజ్, నమో వెంకటేశాయ, జులాయ్, నిప్పు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా పలు సినిమాలలో నటించింది.

ఆ తర్వాత మై డియర్ మార్తాండం అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. ఇక వీరే కాకుండా ప్రియాంక శర్మ కూడా కీలక పాత్రలో నటించింది. అలా ఈ సినిమాలో సమంత, దివ్య శ్రీపాద,కల్పిక గణేష్, ప్రియాంక శర్మ, వీరంతా ఒక గ్యాంగ్ లాగా కనిపిస్తారు. అలా ఏకంగా ఐదు మంది హీరోయిన్లు రావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *