మీరాజాస్మిన్.. ఈమె ఇప్పుడు సినిమాల్లో కనిపించక పోయినప్పటికీ ఈమె పేరు సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తోంది. ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఈమె పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ సినిమాలో నటించి స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఇక ఇందులో మీరాజాస్మిన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు.

ఇక పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చిన మీరాజాస్మిన్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈమె రీ ఎంట్రీ ఇస్తుందని తెలుసుకొని కొంతమంది డైరెక్టర్లు ఈమెను సంప్రదించారట. అయితే నారప్ప సినిమాలో హీరోయిన్ గా చేయడానికి మీరాజాస్మిన్ ని డైరెక్టర్ సంప్రదిస్తే నేను వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించను అంటూ చాలా ఓపెన్ గా డైరెక్టర్ కి చెప్పిందట.

ఆయన ఒకప్పుడు స్టార్ హీరో కానీ ఇప్పుడు ముసలోడు అయిపోయారు అంటూ దర్శకుడు మొహం మీదే చెప్పడంతో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయం తెలిసిన దగ్గుపాటి అభిమానులందరూ వెంకటేష్ లాంటి స్టార్ హీరో ని పట్టుకొని ముసలి హీరో అంటుందా ఈమెకు తల పొగరు చాలానే పెరిగింది అంటూ మండిపడుతున్నారు. ఇక నారప్ప సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించి మంచి విజయం అందుకుంది.

అంతేకాదు డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా హీరోయిన్ గా ముందుగా మీరా జాస్మిన్ ని కలిశారట. కానీ మీరాజాస్మిన్ బాలకృష్ణ తో నటించడానికి కూడా నో చెప్పిందట. ఎందుకంటే మీరాజాస్మిన్ మంచి గ్లామర్ పాత్ర వస్తే అలాంటి రోల్ తోనే రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందట. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *