బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా మీకు గుర్తుందా ? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది.తన కజిన్స్ అయినా ప్రియాంక చోప్రా మరియు పరిణితి చోప్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్ గా ఫుల్ ఫామ్ లో ఉండటం తో మీరా కూడా హీరోయిన్ అవ్వాలని అయితే అనుకుంది.

అయితే ఈ అమ్మడు హిందీ లో ఒక్క సినిమాలో కూడా నటించే అవకాశం కూడా రాకపోవడం తో తొలుత అంబే ఆరూయిరే అనే తమిళ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఆమె పలు కారణాల వల్ల స్టార్ హీరోయిన్ మాత్రం అవ్వలేకపోయింది. కొన్ని సినిమాలో స్పెషల్ పాత్రల్లో కూడా నటించింది.

 

ఇటీవల టాటూ మర్డర్స్ అనే హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఎంతవరకు వస్తాయో చూడాలి. ఇక ఈ సిరీస్ కన్నా ముందు నాస్తిక్ అనే హిందీ సినిమాకు కూడా ఆమె సైన్ చేసింది. మొగిలి పువ్వు అనే తెలుగు సినిమాలో కూడా నటిస్తున్న మీరా ఈ సినిమాలు సక్సెస్ అయితే మల్లి ఫామ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే పబ్లిసిటీ అంటే ఏంటో ఇష్టం ఉన్న మీరా అప్పుడప్పుడు నోటికి పని చెప్తూనే ఉంటుంది. ఓసారి తనకు పరిణితి కి సంబంధం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ఇది హిందీ చిత్ర సీమలో పెద్ద రచ్చకు లేపింది.

దాంతో బాలీవుడ్ లో ఈ అమ్మడికి అవకాశాలు అయితే దక్కలేదు. మరోమారు టాలీవుడ్ స్టార్ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు అస్సలు తెలియదంటూ వ్యాఖ్యలు చేయడం సౌత్ ఇండియాలో సంచలనంగా మారింది. దాంతో ఆమెకు తెలుగు అభిమానుల నుంచి తీవ్రమైన కామెంట్స్ కూడా వచ్చాయి. ఇలా అప్పుడప్పుడు నోటికి పని చెప్తుండటం తో ఆమెకు ఇటు తెలుగు లో సైతం అవకాశాలు లేకుండా పోయాయి. ఇక మరోమారు కరోనా టీకా విషయంలోనూ అవాకులు పేలడం తో అటు బీజేపీ పార్టీ సైతం ఆమెపై విరుచుకుపడిందట. ఇలా సంబంధం లేని విషయాల్లో వేలుపెట్టి మరి ఇండస్ట్రీ కి దూరం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *