పాన్ ఇండియా లెవెల్ వచ్చి బ్లాక్ బస్టర్ రికార్డు అందుకున్న మూవీ ఆర్ ఆర్ ఆర్ లో గోండు వీరుడు గా కొమురం భీమ్ క్యారెక్టర్లో ఇరగదీసిన స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ పతాకం పై పై కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా రూపుదిద్దుకుంటున్న మూవీ #NTR30 త్వరలో పట్టాలెక్కబోతుంది.ఆల్రెడీ డైరెక్టర్ కొరటాల మరియు ఎన్టీఆర్ కాంబో లో వచ్చిన జనతాగ్యారేజ్ మూవీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.

ప్రెసెంట్ టాలీవుడ్ లో అప్పట్లో సూపర్ హిట్ ఐనా స్టార్ హీరోల మూవీస్ లను రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే చిరు,బాలయ్యబాబు,డార్లింగ్ ప్రభాస్ , మహేష్ ,పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ చేసిన సినిమాలు మళ్ళా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

దీంట్లో భాగంగానే తాజాగా ఎన్టీఆర్ బాద్ షా సినిమా రీ రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఎన్టీఆర్ కు జోడి గా కాజల్ నటించిన ఈ మూవీ యాక్షన్ కామెడీ గా భారీ విజయం కైవసం చేసుకుంది.

ఇకపోతే ఈ మూవీని నవంబర్ 19 వ తేదీన రీరిలీజ్ చేస్తాం అని చిత్ర యూనిట్    అన్నారు.దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో ఐతే స్క్రీన్ పైన బాద్షా ఇంకోసారి చూడాలని వెయిట్ చేస్తూన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *