కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా అద్భుతమైన కథ మరియు కథనాలతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలవడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆచార్య సినిమా విషయంలో మాత్రం అంచనాలకు భిన్నంగా జరిగింది. అయితే ఆచార్య ఫ్లాప్ రిజల్ట్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ తాజాగా షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత తాను నటించిన ఆచార్య సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా రాలేదని చరణ్ చెప్పుకొచ్చారు. కంటెంట్ బాగుంటే మాత్రమే ప్రేక్షకులు సినిమా చూస్తారని కంటెంట్ బాలేకపోతే ప్రేక్షకులు సినిమా చూడరని చెప్పడానికి ఇదే సాక్ష్యమని చరణ్ చెప్పుకొచ్చారట. డస్ట్ అలర్జీ వల్ల తాను బాల్యంలో సర్జరీ చేయించుకున్నానని చరణ్ కామెంట్లు చేయడం విశేషం.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఫస్ట్ సీన్ కోసం దుమ్ము, ధూళి మధ్య 35 రోజులు ఉండాల్సి వచ్చిందన్ చరణ్ చెప్పుకొచ్చారు. వేల సంఖ్యలో మనుషుల మధ్య 35 రోజుల పాటు తాను మూవీ షూటింగ్ లో పాల్గొన్నానని చరణ్ కామెంట్లు కూడా చేశారు. దర్శకధీరుడు రాజమౌళి వల్ల ఆ సీన్ అద్భుతంగా వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆచార్య మూవీలో విషయం లేదని అందుకే మూవీ ఫ్లాప్ అని చరణ్ పరోక్షంగానే చెప్పేసారు.

దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో కూడా ఆచార్య సినిమా ఫలితం గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదనే విషయం తెలిసిందే. త్వరలో కొరటాల శివ కూడా ఈ సినిమా ఫలితం గురించి స్పందించే ఛాన్స్ ఉంది. ఆచార్య ఫ్లాప్ ఎంతోమంది జీవితాలను అయితే తలక్రిందులు చేసింది. కథలో చేసిన మార్పులు ఈ సినిమా పరాజయానికి కారణమయ్యాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *