మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక మొదటి సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకొని వరుస సినిమాల్లో నటించాడు. ఇక తర్వాత మగధీర సినిమాతో తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి రుచి చూపించాడు. ఇక ఈ మధ్యనే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇక సినిమాల విషయంలో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ పోతున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. రామ్ చరణ్ తాను ఎంతగానో ప్రేమించిన ఉపాసనని పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి జరిగి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రేక్షకులకు, అభిమానులకు, మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు.. ఇక ఈ విషయంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు మేం ఇప్పుడే పిల్లల్ని కనదలుచుకోలేదు అంటున్నారు. కానీ వీరు గుడ్ న్యూస్ చెప్తే వినాలని చాలామంది ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే వీరి పెళ్లి టైం లో చిరంజీవి చేసిన తప్పు వల్లే రామ్ చరణ్ కి పిల్లలు పుట్టడం లేదంటూ నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి పెళ్లి జరిగాక స్వామివారికి కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నారట. కానీ ఆ మొక్కు తీర్చలేదట. అంతేకాకుండా రాంచరణ్ పెళ్లి టైం లో కూడా అన్ని పెళ్లి పనులు కేవలం ఉపాసన ఫ్యామిలీ వాళ్ళ ఆచారాల ప్రకారమే జరిగాయట. అలాగే పెళ్లికూతురు చేయాల్సిన పూజలు కూడా ఉపాసన ఫ్యామిలీ వాళ్ళ ఆచారం ప్రకారమే చేయించారట.

ఇక చిరంజీవి ఒక్కగానొక్క కొడుకు అయినా రామ్ చరణ్ పెళ్లి విషయంలో కొణిదెల సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయలేకపోయానని చిరంజీవి ఇప్పటికి కూడా బాధపడతారట. ఇక పెళ్లి మండపం ఎక్కాక కూడా మొత్తం ఉపాసన ఫ్యామిలీ సంప్రదాయం ప్రకారమే పెళ్లి జరిగిందట. అయితే రామ్ చరణ్ పెళ్లి కొణిదెల ఆచార సాంప్రదాయాల ప్రకారం జరగకపోవడం వల్లే రామ్ చరణ్ కి ఇంకా పిల్లలు పుట్టడం లేదని చిరంజీవి ఇప్పటికీ చాలా బాధపడుతున్నారట. అయితే ఈ విషయంలో చిరంజీవి,రామ్ చరణ్ ఉపాసన దంపతులకు రెండోసారి గుడిలో పెళ్లి చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *