సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే వచ్చిన ప్రతి పాత్రలో నటించి ఆ పాత్రలో ఒదిగిపోతేనే హీరోయిన్గా నిలదొక్కుకోగలుగుతారు. అంతేకాదు కేవలం అందం మాత్రమే కాకుండా ఆ అందాన్ని ఎక్స్పోజింగ్ చేసే టాలెంట్ ఉంటేనే స్టార్ హీరోయిన్గా నిలుస్తారు. ఇక మామూలు హీరోయిన్ అవ్వడం స్టార్ హీరోయిన్ అవ్వడం అనేది ఆ హీరోయిన్ చేతిలోనే ఉంటుంది. కేవలం నటనపరంగా యాక్టివ్ గా ఉంటే సరిపోదు.

కొంచెం అనుకువగా నోరు దగ్గర పెట్టుకుంటూ ఉంటేనే స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎదుగుతారు అంటున్నారు సినీ విశ్లేషకులు.అయితే మంచి అందం,టాలెంట్ ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లకు టంగ్ స్లిప్ అనే నోటి దురుసు కారణంగా స్టార్ హీరోయిన్గా మారే ఛాన్సులు కోల్పోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు.అలాంటి వారిలో బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే ముందుంటుంది. ఈ హీరోయిన్ పేరుకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ హీరోయిన్ తెలుగులో కూడా బాలకృష్ణ సరసన నటించి తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అయితే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది అని చెప్పలేము. కానీ నటనకు మాత్రం మంచి మార్కులు వేయించుకుంది. ఈమె కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయింది. ఇక అలా పేరు తెచ్చుకో పోవడానికి ప్రధాన కారణం ఆమె నోటి దురిసే అని చెప్పాలి. ఎందుకంటే రాధిక ఆప్టే గురించి మనకు తెలిసిందే. ఆమె ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది. ఇక తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

సీనియర్ హీరోయినన్స్ అందరికీ ఇప్పటికి కూడా ఛాన్స్ లు రావడానికి ప్రధాన కారణం వాళ్ళు చేసుకునే ప్లాస్టిక్ సర్జరీలే అంటూ సీనియర్ హీరోయిన్ల పై బిగ్ బాంబు పేల్చింది. దీంతో హీరోయిన్ రాధిక అప్టే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ గా మారాయి. అయితే రాధిక ఆప్టే మాట్లాడిన మాటలు మనకు కరెక్టే అనిపిస్తాయి.కానీ చాలామంది సీనియర్ హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని ఐదు పదుల వయసు దాటినా కూడా ఇంకా వారి హాట్ హాట్ అందాలతో కుర్ర హీరోయిన్లకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు అంటూ చాలామంది కుర్ర హీరోయిన్లు బాధపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *