తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లరి నరేష్ గత కొంతకాలంగా మంచి సక్సెస్ అందుకోలేక సతమతం అయ్యేవేళ ఒక్కసారిగా ‘నాంది ‘ మూవీ తో భారీ విజయం సొంతం చేసు కున్నాడు.మరల తానేంటో చూపుదాం అని ఇంకో కొత్త కధాంశంతో మరో సారి మన ముందుకొస్తున్నాడు. కధ లో డిఫరెంట్ కాన్సెప్ట్ యే కాకుండా టైటిల్ కూడా వెరైటీ గా ఉంది. ఇపుడు ప్రెసెంట్ రిలీజ్ ఐనా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది ఐతే ట్రైలర్ తో పాటుగా విడుదల తేదీన్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు.

నాంది మూవీలో అల్లరి నరేష్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు కూడా కొత్తగా అండ్ డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ అల్లరి నరేష్‌కు యాభై తొమ్మిదవ మూవీ.ఈ మూవీని హాస్య మూవీస్-జీ స్టూడియోస్ సంయక్తంగా నిర్మింస్తుంది మరియు ఏఆర్ మోహన్ గారు దీనికి డైరెక్షన్ చేసారు.

ఇక కథ విషయానికి వస్తే ఒక మారుమూల అటవీ ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ అధికారి క్యారెక్టర్ లో అల్లరి నరేష్‌దకనబడునున్నారు. ఆ ఊరిలో ఆ అధికారికి ఎదురైన కష్ట నష్టాలు, అపాయాలు, ప్రతి నాయకుడి యొక్క వ్యవహారం, అలాగే అల్లరి నరేష్‌పై గ్రామస్థులు దాడి చేయడం వంటి సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.ఫారెస్ట్ లో బతికే ఆ పల్లెటూరి ఊరిజనంతో ఓట్లేయించేందుకు అల్లరి నరేష్ చేసిన ప్రయత్నాలన్నీ మూవీ లో వివరంగా చూపించారు.

ఈ మూవీలో చేసిన ఇతర తారగణం వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్రలు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనబడునున్నారంట. జాంబీ రెడ్డి సినిమా ద్వారా ఆకట్టుకున్న ఆనంది కూడా ఈ మూవీ లో కనబడుతుంది. వైవిద్యమైన కథాంశంతో ఈ మూవీ నవంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానున్నది. ఐతే ఈ మూవీ ఎలాంటి హిట్ సాధిస్తుందో అనేది వేచి చూడాలి. ఈ మూవీ ఐనా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో విలన్ చేసే పనుల వల్ల అల్లరి నరేష్‌ను గ్రామస్థులు అపార్ధం చేసుకొని,తప్పుగా భావించి కొట్టి, అపుడు ఆ ఊళ్ళో పరిస్థితుల్ని బాగుచేసి ఎలా వాళ్ళ సమస్యల్ని గట్టేక్కించడో తెల్పేది ఈ కధ సారాంశం.

ఏదేమైనా ఈ సినిమా కూడా అల్లరి నరేష్ కు భారీ విజయాన్ని చేకూర్చాల్ని భవిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *