సమంత యశోద సినిమాతో ఒంటరిగా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ సాధించింది. ఇక సింగిల్ హ్యాండ్ తో తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకోవడంతో ఇప్పుడు అందరూ నాగచైతన్యను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే తాత తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి కనీసం సమంతలా ఒంటరిగా ఒక హిట్టు కూడా సాధించలేదు అంటూ నాగచైతన్య ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం నాగచైతన్యను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెళుగుతున్న సమంత మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో యశోద సినిమాలో ఒంటరిగా నటించింది. ఈ సినిమాలో సమంత సరోగెట్ మదర్ గా జీవించేసి సరోగసి పద్ధతి పై జరుగుతున్న అన్యాయాలను ఈ సినిమా ద్వారా అందరికీ చాలా స్పష్టంగా చూపించారు. ఇక ఈ సినిమాలో సమంత ప్రతి సన్నివేశాల్లో ఒదిగిపోయి నటించింది.

అంతేకాదు సమంత ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే హీరో లేకుండా ఒక హీరోయిన్ ఒంటరిగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక సమంత సినిమా హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో సమంత అభిమానులు నాగచైతన్యను ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. కనీసం నీ మాజీ భార్య ఓ అరుదైన జబ్బుతో బాధపడుతున్నా కూడా గెట్ వెల్ సూన్ అనే ఒక మెసేజ్ పెట్టే దమ్ము కూడా లేదు.

నువ్వు ఇండస్ట్రీలో స్టార్ హీరోవా? ఎవరయ్యా నువ్వు స్టార్ హీరో అని చెప్పింది? నువ్వు కనీసం నీ తండ్రి నాగార్జున, నీ మాజీ భార్య సమంత సపోర్ట్ లేకుండా ఒక్క సినిమా కూడా ఒంటరిగా సక్సెస్ తెచ్చుకోలేదు. అలాంటిది నువ్వు హీరోవా? కనీసం నీ మాజీ భార్యకు ఉన్న ధైర్యం,దమ్ము,తెగింపు లాంటివి నీలో ఏమైనా ఉన్నాయా? నీ తండ్రి నాగార్జున,నీ మాజీ భార్య సమంత సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్క సినిమాలోనైనా సక్సెస్ అయ్యావా? అలాంటి సినిమా ఏదైనా ఉంటే చెప్పు అంటూ నాగచైతన్యను సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్యపై ట్రోలింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *