తెలుగు ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా రీమేక్ మూవీస్ బాట లో పడ్డారు.ఈ మధ్య కాలం లో విడుదల ఐనా గాడ్ ఫాదర్ కూడా మలయాళ రీమేక్ మూవీనే. ఐతే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అకట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరు మరల మలయాళ మూవీ ని రీమేక్ చెద్దాం అనే ఆలోచనలో ఉన్నారంట. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరోలు ఐనా మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన సినిమా ‘బ్రో డాడీ ‘ ఐతే ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తుంది కూడా పృథ్వీరాజె.

ఐతే ప్రస్తుతం ఈ మూవీ ని చిరంజీవి రీమేక్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.ఇక్కడ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరు మరియు తనయుడిగా వేరొక మెగా హీరో చేసే అవకాశం ఉందంటున్నారు.దీనికి ఆయన అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఐతే మెగా కుటుంబం మాత్రం దీన్ని పట్టించుకవట్లేదని తెలుస్తుంది.ఐతే “బ్రో డాడీ” మూవీ అనేది ఒక హాస్యభరితమైన సినిమా. ఈ కారణం వల్ల చిరు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట.దీని గురించి ఇంకా ఇండస్ట్రీ వర్గాల నుండి ఎటువంటి సమాచారం అధికారకంగా లేదు.

పైగా ఈ మూవీ కి బడ్జెట్ చాలా తక్కువ అవుతుందని అనుకుంటున్నారు.ఈ మూవీ కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే అవకాశం చాలా ఉంది.చిరంజీవి గారు చేసే కామెడీ ట్రాక్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన గతంలో చాలా మూవీస్ లో తనదైన స్టైల్ తో ఆధారగొట్టారు.చంటబ్బాయి, దొంగ మొగుడు,శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి కామెడీ ట్రాక్తో కూడిన మూవీస్ వారి అభిమానులు కోరుకుంటున్నారు కనుక ఈ మూవీ వారి కోరికనుతీరుస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *