ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ప్రజల్లో జోరుగా అయితే చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో తారక్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారా?అనే చర్చ ఎంతో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి తారక్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఫోటో చించేశారనే సంగతి చాలామంది అభిమానులకు అయితే తెలియదు.

ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కూడా నా మనవడేనని తారక్ నా భుజంపైన తాత భుజం పైన చెయ్యి వేసి ఫోటో దిగాడని ఆ తర్వాత నా ఫోటో చించి అవతల పడేశాడని కూడా ఆమె అన్నారు. తాతగారితో ఉన్న ఫోటోనే బయట కనిపిస్తోందని నాతో దిగిన ఫోటో బయట కనిపించడం లేదని కూడా ఆమె అన్నారు. ఆరోజుల్లో అయితే నేను తారక్ ను చాలా బాగా చూసుకున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు.

వైభవంతో ఉన్నప్పుడు మాత్రమే అందరూ వస్తారని వైభవం పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఎవరూ కూడా గుర్తుకు రారని ఆమె కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎవరిపై కూడా అస్సలు ఎప్పుడూ డిపెండ్ కాలేదని ఆమె అన్నారు. తారక్ టీడీపీలోకి వచ్చినా నేను వైసీపీలోనే ఉంటానని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారటా… టీడీపీ ఓడిపోయిన సమయంలో ప్రజలకు చేయాల్సినవన్నీ నేను చేశానని ప్రజలకు ఏం తక్కువ చేశానో అర్థం కావడం లేదని సీనియర్ ఎన్టీఆర్ అన్నారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారట.. బాల్యం నుంచి సీనియర్ ఎన్టీఆర్ కు నేను వీరాభిమానినని కూడా ఆమె తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ ను కలవకపోయినా కానీ ఆయన బయోగ్రఫీ రాసేదానినని ఆమె పేర్కొన్నారు. నేను రాసిన బయోగ్రఫీలో ఆయనకు సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ బాల్యంలో 100 ఎకరాల పొలం పోగొట్టుకున్నారని కూడా లక్ష్మీపార్వతి అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *