సినీనటిగా , బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా, బిజెపి నాయకురాలిగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫేమ్ సంపాదించుకుంది కరాటే కళ్యాణి. తన వ్యాఖ్యలతో వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణికి ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. అయినా అందులో ఏ ఒక్కటి నిలబడలేదు. తాజాగా తన వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయట పెడుతూ ఎమోషనల్ అయింది కళ్యాణి.

నిజానికి భార్య అంటే వంటింటికే పరిమితం అనుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ తాను అలా కాదు అంటోంది కరాటే కళ్యాణి. ఫైర్ లాంటి దాన్ని.. అందుకే నిప్పును ఎక్కువసేపు అరచేతిలో పట్టుకోలేక వదిలేసారు అని చెబుతోంది. తాను కరెక్ట్ గానే ఉన్నా కూడా అవతలి వారికది తప్పుగా అనిపించి.. మనస్పర్ధలు వచ్చాయని తన వైవాహిక జీవితం గురించి బయటపడింది. గొడవ పడడం నచ్చకే విడాకులు తీసుకున్నాను అంటూ స్పష్టం చేసింది. అందుకే తనకు నచ్చినట్టుగా హ్యాపీగా జీవిస్తున్నాను అని కూడా తెలిపింది.

అయితే కొంతమంది తనను ప్రేమ పేరుతో వాడుకున్నారని.. అందుకే నిజమైన ప్రేమ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపింది. అంతేకాదు సరైన అబ్బాయి దొరికితే పెళ్లికే కాదు సహజీవనాన్ని కూడా తాను సిద్ధం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కళ్యాణి .అంతేకాకుండా తనకు పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఒక పాపను దత్తత తీసుకున్నాను అని కూడా తెలిపింది. మొదటి భర్తతో విడాకులు కావడంతో పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్నాను అతడు కూడా తాగొచ్చి కొడుతుంటే భరించలేక విడాకులు తీసుకున్నాను అంటే తెలిపింది. అలా రెండు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా పిల్లలు కనడంలో నా కోరికను తీర్చలేదు అంటూ తెలిపింది.

ఒకవేళ తాను చేయని తప్పులకు కూడా నిందలు వేస్తే తనకు నచ్చదని.. వైవాహిక జీవితంలో కష్టాల వల్ల.. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాను అంటూ తెలిపింది. ఒకసారి చనిపోవాలని 10 నిద్ర మాత్రలు వేసుకుందట. కానీ బతికి బయటపడటంతో తాను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది అనుకొని, ధైర్యంగా జీవిస్తున్నాను అంటూ తెలిపింది. అంతేకాదు తాను పడిన కష్టాలు మరెవ్వరూ పడకూడదని కూడా చెబుతోంది కళ్యాణి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *