టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇటీవల ఒక భారీ ప్రాజెక్టులో విలన్ గా నటించనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు విలన్లుగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, గోపీచంద్, శ్రీకాంత్, జగపతిబాబు లాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా విలన్లుగా వెండితెరపై రాణిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ పాన్ ఇండియా హీరో విజయ్ దేవరకొండ కూడా విలన్ గా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Brahmastra 2: Is Vijay Deverakonda Really In Consideration To Play Dev In  Ranbir Kapoor Led Magnum Opus?

గతంలో చిన్న చిన్న పాత్రల ద్వారా అతి తక్కువ సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన ఈ హీరో పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయిన ఈయన ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దాంతో బయట కనిపించడమే మానేశారు విజయ్. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ వైరల్ గా మారుతోంది. విలన్ గా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వనున్నాడు అని పరిశ్రమ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతూ ఉండడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళ్తే రన్ బీర్ కపూర్ , అలియా భట్ హీరో హీరోయిన్లుగా అమితాబచ్చన్, నాగార్జున, షారుక్ ఖాన్ కీలక పాత్రలో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.. ఇందులో మౌని రాయ్ కూడా విలన్ పాత్రలో నటించి చాలా బాగా అలరించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో రెండవ భాగంపై దృష్టి పెట్టిన మేకర్స్ తొలి భాగంలో మెయిన్ విలన్ దేవ్ ని చూపించలేదు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా వైడ్ గా పేరు ఉన్న మంచి నటుడిని దేవ్ గా చూపిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించారు.

ఈ క్రమంలోనే సౌత్ లో కూడా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడు అని మేకర్స్ ఆలోచించారు. అంతేకాకుండా ఉత్తరాదిని కూడా బాగా క్రేజ్ లభించడంతో దేవ్ పాత్రలో విజయ్ దేవరకొండ ను తీసుకోబోతున్నట్లు సమాచారం ఈ విషయం తెలిసి అభిమానుల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *