లావణ్య త్రిపాఠి ఈమె పుట్టింది డెహ్రాడూన్ లో అయినప్పటికీ కూడా ఈమె చదువు మొత్తం ముంబైలో నే పూర్తి చేసింది.తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదట కొన్ని చిత్రాలతో బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత పెద్దగా అయితే ఆకట్టుకోలేకపోయింది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు మోడలింగ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేదట. అలా స్కూల్లో చదువుతున్న సమయంలో మిస్ ఉత్తరకాండ్ గా ఎంపికయింది లావణ్య త్రిపాఠి. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లావణ్య కి పెద్దగా గుర్తింపు రాలేదట.

అలా మొదటిసారిగా హిందీలో పలు సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అయితే అందుకుంది. దీంతో సినిమాలలో ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సమయమని ఆలోచించి తెలుగులో అందాల రాక్షసి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇక బాలీవుడ్ ని వదిలేసి సౌత్ ఇండియాలో హీరోయిన్ గా మారిపోయిందట.అయితే లావణ్య త్రిపాఠి తన కెరియర్లో ఎన్నో వివాదాలలో అయితే చిక్కుకుంది వాటి గురించి తెలుసుకుందాం.

మొదట తెలుగులో మంచి విజయం సాధించిన 100% లవ్ చిత్రాన్ని తమిళ రీమిక్స్ చేయాలని 2017 లావణ్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట.అయితే ఈ సినిమా మొదలయ్యాక షూటింగ్ కి హాజరు కాలేకపోవడంతో కోలీవుడ్ ఆమెను నిషేధించినట్లు తెలుస్తుంది..

అటు తరువాత టాలీవుడ్ సినిమాలు విషయానికి వస్తే చాలామంది హీరోలతో ఎఫైర్ ఉందని వార్తలు అయితే వైరల్ గా మారుతూ ఉండేవి. ముఖ్యంగా వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు రావడమే కాకుండా వివాహం జరగబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఒక యూట్యూబర్ కూడా ఆమె పైన పలు వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యక్తి పైన లావణ్య ఏకంగా లీగల్ నోటీసులు పంపించడంతో ఆ వివాదం పూర్తయింది. మరి రాబోయే రోజులలోనైనా ఇలాంటి రూమర్లకు చెక్ పెడుతుందో లేదో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *