తెలుగులో రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఆరవ సీజన్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఆరవ సీజన్లో 10వ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతోందని చెప్పాలి. మిగిలిన 9 వారాలకు గాను 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు పదో వారం ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేమిటంటే పదవ వారం డబుల్ ఎలిమినేషన్ తో ట్విస్ట్ ఇవ్వడం అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Bigg Boss Telugu 6: Vasanthi gets frustrated and emotional after Raj  nominates her for eviction; here's what netizens think - Times of India

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సిక్స్ సీజన్ దాదాపు చివరి దశకు చేరుకున్నదనే చెప్పాలి. ప్రస్తుతం 69వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో 22 రోజులు నడవనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బిగ్ బాస్ ఆరవ సీజన్లో విచిత్ర సంఘటనలు, అనూహ్య పరిణామాలు, రొమాన్స్ లు, అరుపులు, గొడవలు, పోట్లటలు ఇలా ఇన్ని రోజులు సాగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఆరవ సీజన్ 10వ వారం షాకింగ్ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయబోతున్నారు బిగ్ బాస్..

బిగ్‌ బాస్‌ బిగ్ షాక్‌.. బాలాదిత్య ఎలిమినేటెడ్‌.. వాసంతి అందంపై సెటైర్లు

ఇప్పటికే హౌస్ నుంచి తొమ్మిది వారాలకు గాను తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. వారిలో.. షానీ సల్మాన్ ముందుగా ఎలిమినేట్ అవ్వగా ఆ తర్వాత అభినయశ్రీ.. నేహా చౌదరి.. ఆరోహి రావు.. చంటి.. సుదీప పింకీ.. అర్జున్.. ఆర్ జె సూర్య.. ఎలిమినేట్ అయ్యారు. కానీ ఊహించని విధంగా తొమ్మిదో వారం చిత్తూరు చిరుత గీతూ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. తర్వాత బిగ్బాస్ ఆరవ సీజన్లోని పదోవారం నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగింది. నామినేషన్ లో భాగంగా ఈసారి 9 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇకపోతే వారిలో ఇనయా సుల్తానా, కీర్తి భట్, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, బాలాదిత్య, మెరీనా అబ్రహం, శ్రీహాన్ నామినేట్ అయ్యారు.

కెప్టెన్ అయిన కారణంగా శ్రీ సత్య తో పాటు రాజశేఖర్, రోహిత్ ను కూడా ఎవరు నామినేట్ చేయలేదు. దీంతో వారు ముగ్గురు సేఫ్ అయ్యారు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బాలాదిత్య, వాసంతి కృష్ణన్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వీరిద్దరూ ఎలిమినేట్ అవ్వడం హౌస్ మేట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *