గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ప్రముఖ నటుడు నాగినీడు స్పందించారు.. ప్రసాద్ ల్యాబ్ లో జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఈయన ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ సలహాతో సినిమాలలోకి వచ్చారు. మొదట వివి వినాయక్.. చెన్నకేశవరెడ్డి సినిమాలో మంత్రి పాత్రలో కనిపించిన నాగినీడు. ఆ తర్వాత రాజమౌళి సినిమా మర్యాద రామన్న సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు తమిళ భాషలో కూడా మంచి సినిమాలలో నటించారు నాగినీడు.

గత ఏడాది మా అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యుడుగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా బిల్డింగ్ తదితర హామీల గురించి విష్ణు అధ్యక్షుడు అయ్యాక చేస్తున్న పనుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్, విష్ణు పోటా పోటీగా జరిగిన మా ఎలక్షన్లో మంచు విష్ణు, అతని పానెల్ గెలిచారు. సార్వత్రిక ఎన్నికల తరహాలో హామీలు, ప్రచారాలు అంటూ హోరెత్తించారు. ముఖ్యంగా మంచు విష్ణు గెలవడానికి కారణం మా అసోసియేషన్ కి బిల్డింగ్ కట్టిస్తానని హామీ ఇవ్వడమే.. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ చేసిన నేను ఓడిపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి అంటూ వెల్లడించారు.

ఎలక్షన్ మొదలయ్యాక విత్ డ్రా అవ్వాలని అనుకున్నా కానీ కొనసాగించాల్సి వచ్చింది. ప్రకాష్ రాజ్ నటుడుగా బాగా ఇష్టం.. కానీ వ్యవహారికంగా భేదాభిప్రాయాలు వచ్చాయి. పైగా నాకు ఓట్లు అడగడం అనే పద్ధతి నచ్చలేదు . మన గురించి ఒక అవగాహన.. ఎంత సోషల్ సర్వీస్ చేయగలం అని తెలిస్తే.. వాళ్లే ఓట్లు వేస్తారు కదా.. ఒకవేళ నచ్చకపోతే ఓట్లు వేయరు అడగాల్సిన పనిలేదు అని నా అభిప్రాయం. అందుకే నేను ఓట్లు అడగలేదు. ఇక ఓడిపోయినా పెద్దగా ఏమనిపించలేదు అంటూ తెలిపారు.

విష్ణు హామీల గురించి మాట్లాడుతూ.. గెలిపించుకున్న వాళ్లు.. ఓట్లు వేసిన వాళ్ళు అడగాలి.. నేనెందుకు అడగాలి హామీలు ఏమయ్యాయని.. ఓట్లు వేసిన వాళ్ళు సైలెంట్ గా ఉన్నప్పుడు వేరే వాళ్లకెందుకు అంటూ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నాగినీడు చేసిన ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *