సినీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన మొదటిసారి మన దేశం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు 1949లో విడుదలైన ఈ సినిమాలో చిత్తూర్ నాగయ్య హీరోగా నటించారు. ఇందులో పోలీస్ ఆఫీసర్గా ఒక చిన్న పాత్రలో ఎన్టీఆర్ నటించగా..హీరోయిన్ గా కృష్ణవేణి నటించారు. ఈ సినిమా తర్వాత ఆమె చాలా పాపులర్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక కృష్ణవేణి తొలిసారి సతీ అనసూయ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయి మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు ఈ అవకాశం రావడానికి కారణం రేలంగి వెంకట్రామయ్య.

నాటకాలను ప్రొడ్యూస్ చేసేవారు . అలా ఆయన నాటకాలలోనే కృష్ణవేణి నటించేది. ఆ పరిచయంతోనే రేలంగి వెంకట్రామయ్య.. సి.పుల్లయ్య గారికి కృష్ణవేణిని పరిచయం చేసి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. రేలంగి వెంకట్రామయ్య నిర్మాణంలో తెరకెక్కించిన రామదాసు అనే నాటికకు వెళ్ళిన పుల్లయ్య అక్కడ కమల పాత్ర చేస్తున్న కృష్ణవేణిని చూసి పరవశించిపోయిన ఆయన ఆ తర్వాత కొన్ని రోజులకు రేలంగా ద్వారా మద్రాస్ కి కృష్ణవేణి పిలిపించారు ..అక్కడే స్టూడియోలో ఉంచుకొని ఆమెకు సతి అనసూయ సినిమాలో వేషం ఇచ్చారు. ఆ తర్వాత రోజుల్లోనే వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది.

Who are real Telugu actresses in the Telugu film industry? - Quora
13 ఏళ్లకే హీరోయిన్గా మారిన కృష్ణవేణి ఆ తర్వాత భోజ కాళిదాసు సినిమాలో కన్నాంబ మొదటి హీరోయిన్గా నటిస్తే .. కృష్ణవేణి రెండవ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను మీర్జాపురం రాజావారు జయ ఫిలిమ్స్ ద్వారా నిర్మించారు. ఆ తర్వాత కచాదేవాయని అనే సినిమాలో దేవయాని పాత్రలో నటించింది కృష్ణవేణి. జయ ఫిలిమ్స్ వారి దగ్గరే ఉండిపోయి వారి సినిమాలలోని నటిస్తూ మీర్జాపురం రాజా వారికి రెండవ భారీగా వెళ్ళింది. పెళ్లయ్యాక సైతం వారి సినిమాలలోనే నటించింది. రాజావారు మరణించిన తర్వాత రాణిగా వెలిగిన కృష్ణవేణికి ఏ లోటు లేకపోయినా.. రాజరికపు వ్యవస్థ చచ్చిపోవడంతో వారి ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం సొంతం చేసుకుంది.

దాంతో తమిళనాడు ప్రభుత్వం పై కోర్టులో కేసు వేశారు. ఇప్పటికీ అలా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కృష్ణవేణి. ప్రస్తుతం విజయవాడలో ప్రభుత్వం కట్టిన గన్నవరం ఎయిర్పోర్ట్ అంతా కూడా మీర్జాపురం రాజావారి భూమేనట. అయితే అక్కడ విమానాశ్రయం కట్టడానికి ప్రభుత్వానికి వారు విరాళం ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే రాజ్య వ్యవస్థ పతనం అవడంతో ఆమె ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *