గతంలో వచ్చిన పూరి జగన్నాధ్ పాన్ ఇండియా తరహా మూవీ ఐనా ‘లైగర్’ డిసస్టర్ గా నిల్చింది. దాంతో విజయ్ దేవరకొండ తర్వాత చిత్రం ఐనా ‘ఖుషి’ మీద మేకర్స్ ఫుల్ ఫోకస్ పెట్టి తీస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఇంకో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసాడు. అవి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘జన గణ మన’ అలాగే సుకుమార్ డైరెక్షన్ లో ఒక మూవీ. ‘జనగణమన’ మూవీ బొంబాయి లో గ్రాండ్గా స్టార్ట్ చేసినప్పటికీ,’లైగర్’ ఎఫెక్ట్ తో అది కొంచం హోల్డ్ లో పెట్టినట్టుగా పుకార్లు వినబడుతున్నాయి.

ప్రెసెంట్ సుకుమార్ కూడా విజయ్ ని పక్కన పెట్టాలనే థాట్ లో ఉన్నట్లు పుకార్లు వినబడుతున్నాయి. ప్రెసెంట్ సుకుమార్ అల్లు అర్జున్ తో ‘పుష్ప2′ ప్రాజెక్ట్ తో బిజీ గా ఉన్నాడు. నైన్ మంత్స్ లోనే ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలనే పనిలో ఆయన ఉన్నాడు.అందులోనూ జపాన్, చైనా వంటి వి దేశాల్లో కూడా ఒకేసారి ఈ మూవీ ని విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు.

అల్లుఅర్జున్ తో మూవీ కంప్లీట్ ఐనా తర్వాత చరణ్ తో కూడా చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు.చరణ్ కూడా ‘జెర్సీ’ డైరెక్టర్ తో చేసే మూవీ పక్కనపెట్టి సుకుమార్ తో ఓకే అన్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.దీన్ని బట్టి చూస్తుంటే విజయ్ తో సుకుమార్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే అని గుసగుసలు వినబడుతున్నాయి.దీన్ని డైరెక్టర్ గా చెప్పలేరు కాబట్టి అలా చెప్తున్నారు అని నేటిజన్లు భావిస్తున్నారు.కానీ దీన్ని విజయ్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. మళ్ళా విజయ్ కి బ్లాక్ బస్టర్ పడుతుంది అపుడే డైరెక్టర్స్ వాళ్లే విజయ్ దగ్గరికి వస్తారని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *