అటు తమిళంలోనే కాదు ఇటు తెలుగు లోను అభిమానులు సొంతం చేసుకున్న తమిళ స్టార్ నటుడు సూర్య. తనదైన స్టైల్ తో మాస్ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక మాస్ హీరో గా అలాగే కుటుంబ కథలతో వచ్చి ఫ్యామిలీ ని ఆకట్టుకునే పేరుపొందిన స్టార్ సూర్య.ఆయన ప్రెసెంట్ శివ డైరెక్షన్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ లో నటిస్తున్నారు. డైరెక్టర్ శివ ఈ మూవీ ని ఒక పీరియాడిక్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారంట. ఈ మధ్యన రిలీజ్ ఐనటువంటి మోషన్ పోస్టర్ తో ఆ మూవీ పై భారీ అంచనాలు ఎక్కువయ్యాయి.

రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ ఐంది. హీరో సూర్యకి క్లాస్ తో పాటు మాస్ ఇమేజ్ కూడా బాగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మూవీ చేస్తున్నారంట శివ గారు. మాస్ ఫ్యాన్స్ కోసం హీరో సూర్య సింగం లాంటి చిత్రాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సింగం సిరీస్ తో హీరో సూర్య ఒక సూపర్ కాప్ లాగా చేంజ్ ఐపోయారు.

సింగం సిరీస్ లో వచ్చిన త్రి మూవీస్ కూడా అభిమానుల్లను మరియు ప్రేక్షకులను బాగా అలరించాయి. ప్రెసెంట్ సింగం 4 రెడీ అవుతున్నట్లు బలమైన వార్తలు వినబడుతున్నాయి. 2010లో వచ్చిన సింగం మొదటి భాగం ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెల్సు.2013లో రెండవ భాగం కూడా హిట్ గా నిల్చింది.

2017లో మూడవ భాగం రిలీజ్ అయినా మూవీ కూడా హిట్ లాగే నిల్చింది. కనుకనే వాటి సిరీస్ లో భాగంగానే ఈ మధ్యనే డైరెక్టర్ హరి గారు సింగం 4 కి సంబంధించిన స్టోరీ లైన్ ను సూర్యకి వినిపించారట. ఈ స్టోరీ లైన్ అనేది సూర్య కు నచ్చడం తో దీని స్క్రిప్ట్ డెవెలప్ చేయమని సూర్య అన్నారంట. ఈ విషయం తెలియగానే సూర్య ఫ్యాన్స్ కి మరో మాస్ మసాలా రెడీ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *