అవును..మీరు వింటున్న నిజమే. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. వివరాల్లోకి వెళ్తే.. ఈసారి బిగ్ బాస్ సీజన్ చెత్త టిఆర్పిని నమోదు చేసుకొని సాగుతోంది అంటూ ముందు నుండి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరికీ తెలియని మొహాలను హౌస్ లోకి తీసుకువచ్చారు అంటూ చాలా మంది నెటిజన్లు ఈ షోని చూడలేదు. కానీ రాను రాను ఈ షో పై ఆసక్తి పెరిగి మెల్లిగా షో చూడడం మొదలుపెట్టారు.

ఇక ఈ షోలో గలాటా గీతూ ఆట చూసి చాలామంది ఆమెను తిట్టుకుంటే,ఇంకొంత మందేమో ఆమె ఆడేది కరెక్ట్ అంటూ మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా బిగ్ బాస్, నాగార్జున కూడా ఈమె చేసింది కరెక్ట్ అన్నట్టు మెచ్చుకున్నారు. కానీ గీతూ చేసే అల్లరి మితిమీరడంతో బిగ్ బాస్ కోపానికి బలైపోయింది. అలాగే ప్రేక్షకులకు కూడా ఆపై నెగెటివిటీ పెరిగింది. దీంతో హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. గీతూ ఒక్కతే కాదు అంతకుముందు ఎలిమినేట్ అయిన ఆర్.జె.సూర్య,చలాకి చంటి కూడా టాప్ ఫైవ్ వరకు ఉంటారని అందరూ అనుకున్నారు.

కానీ వీళ్లు కూడా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. ఇక వీరి ఎలిమినేషన్ చూస్తుంటే వరుసగా రెండు వారాలు ప్రేక్షకులకు బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. ఇక ఈవారం కూడా బిగ్బాస్ ప్రేక్షకులకు అలాంటి షాకే ఇవ్వబోతున్నాడు అంటూ ఆడియన్స్ అందరూ భావిస్తున్నారు. ఇక ఈ వారం రేవంత్, బాలాదిత్య, ఫైమా, ఆదిరెడ్డి, కీర్తి భట్, మెరినా, వాసంతి, శ్రీహన్, ఇనయా లు నామినేషన్స్ లో ఉన్నారు. ఎప్పటిలాగే రేవంత్ టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. రెండో ప్లేస్లో ఇనయా ఉండి రేవంత్ కి గట్టి పోటీ ఇస్తుంది.

ఇక ఈవారం ఎలిమినేషన్ కి దగ్గరగా వాసంతి,బాలాదిత్య, మెరీనా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. శనివారం రోజు మెరీనా ఎలిమినేట్ అయితే, ఆదివారం రోజు బాలాదిత్య ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే కచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *