ఈ ఏడాది ఏంటో చాలామంది అభిమాన హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకొని అంతే తొందరగా గుడ్ న్యూస్ కూడా చెబుతూ అభిమానులకు డబల్ ఉత్సాహాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, అలియా భట్, చాలామంది స్టార్ హీరోస్ అందరూ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు.

అయితే తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కి కూడా పెళ్లి ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఆయన వివాహం చేసుకోబోతున్న అమ్మాయి పేరు అనూష శెట్టి అని, ఆమె కూడా పెద్ద బిజినెస్ ఉమెన్ అన్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే మరో హీరోయిన్ సైతం పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

మలార్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి.. ఆ తర్వాత ఫిదా సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలు మార్చేసింది. ఈ హీరోయిన్ గ్లామరస్ పాత్రలు కాకుండా నటనపరంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అంతేకాకుండా లేడీ పవర్ స్టార్ ఫాలోయింగ్ అందుకున్న సాయి పల్లవి చెల్లెలు సైతం సినిమా రంగంలోకి వచ్చింది.

కాగా ఇప్పుడు సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకోబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. తన సొంత బావని సాయి పల్లవి సిస్టర్ పెళ్లి చేసుకోబోతుందట.. ఈ పెళ్లి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా సాంప్రదాయ బద్ధంగా ఇంట్లోనే చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి సాయి పల్లవి ఈ వార్త పై ఎలా స్పందిస్తుందో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *