ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. రామాయణం ఆధారంగా మైథాలాజికల్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ఈ జనరేషన్ వారికి నచ్చుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా యొక్క టీజర్ ను అయోధ్యలో విడుదల చేయడం నిజంగా అందరిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి.

ఇప్పటిదాకా ఈ విధంగా ఓ టీజర్ వేడుకను ఏ సినిమా కు చేసింది లేదు. శ్రీ రాముడు సినిమా కాబట్టి ఈ చిత్రాన్ని అయోధ్యలో విడుదల చేస్తే మంచి గుర్తింపు వస్తుందని భావించి నిర్మాతలు ఆ విధమైన ప్రణాళిక రూపొందించారు. టీజర్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. సీతగా కృతి సనన్ నటిస్తూ ఉండగా రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన ఉండటం విశేషం. ఇప్పటికైతే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయని చెప్పాలి.

అయితే అది పురుష్ సినిమాను రాంగ్ టైమ్ లో విడుదల చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు ప్రభాస్ అభిమానుల నుంచి వినపడుతున్నాయి. సంక్రాంతి కానుకగా తెలుగులో చాలా సినిమాలే ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. అవన్నీ కూడా పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలే మాస్ మసాలా సినిమాలో కావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఇష్టపడరు అనేది వారి వాదన.

మైథలాజికల్ సినిమాను ఇప్పుడు కూడా సోలో గానే విడుదల చేయాలని ఇన్ని సినిమాల మధ్య భారీ స్థాయిలో పోటీ ఉన్న సినిమాల మధ్య విడుదల చేయడం తప్పకుండా ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ప్రభావం చూపుతుంది అని అంటున్నారు ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *